ePaper
More
    Homeఅంతర్జాతీయంIran - Israel | ఇరాన్‌కు మరో దెబ్బ.. ముగ్గురు సీనియర్ కమాండర్లు హతం

    Iran – Israel | ఇరాన్‌కు మరో దెబ్బ.. ముగ్గురు సీనియర్ కమాండర్లు హతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran – Israel | ఇజ్రాయిల్ దాడుల్లో (Israel attacks) ఇప్పటికే కీలక సైనికాధికారులు, శాస్త్రవేత్తలను కోల్పోయిన ఇరాన్(Iran)కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కచ్చితమైన వైమానిక దాడులతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్(Islamic Revolutionary Guard Corps)కి చెందిన ముగ్గురు సీనియర్ కమాండర్లను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (Israeli Defense Force) మట్టుబెట్టింది. దీంతో టెహ్రాన్ ప్రాంతీయ ప్రభావానికి, మధ్యప్రాచ్యం అంతటా ఉగ్రవాద నెట్వర్క్లకు దాని మద్దతుదారులకు తీవ్ర దెబ్బ తగిలినట్లయింది.

    Iran – Israel | బెహ్నామ్ షహ్రియారి

    ఖుడ్స్ ఫోర్స్ ఆయుధ సరఫరా విభాగంలో సీనియర్ కమాండర్ బెహ్నామ్ షహ్రియారి (Behnam Shahriari), ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో పశ్చిమ ఇరాన్లో తన వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రెసిషన్ స్ట్రైక్ (Israeli precision strike) చేసి అతడ్ని అంతమొందించింది. ఇరాన్ ఆయుధాల అక్రమ రవాణా నెట్వర్క్ను, దాని ప్రాక్సీలకు పర్యవేక్షించడంలో షహ్రియారి కీలక వ్యక్తి అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తెలిపింది. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, యెమెన్లో హౌతీ మిలీషియాకు ఆయుధాలు సమకూర్చడంలో షహ్రియారి ప్రత్యక్షంగా పాల్గొన్నాడని పేర్కొంది. ఆయుధ అక్రమ రవాణాతో పాటు, టర్కీ, లెబనాన్లోని షెల్ కంపెనీలు, గ్లర్ల నెట్వర్క్ ద్వారా ఉగ్రవాద గ్రూపులకు ఏటా మిలియన్ల డాలర్లను అందించడంలో షహ్రియారి కీలక పాత్ర పోషించాడని పేర్కొంది.

    Iran – Israel | నేలకొరిగిన సయీద్ ఇజాది

    ఇరాన్ నగరమైన కోమ్ లో జరిగిన మరో వైమానిక దాడిలో కుడ్స్ దళంలోని పాలస్తీనా విభాగం అధిపతి సయీద్ ఇజాది (Saeed Izadi) కూడా మరణించాడు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్లో జరిగిన మారణహోమానికి ముందు హమాస్ కు వనరులను సరఫరా చేయడంలో ఇజాది కీలక పాత్ర పోషించాడని ఐడీఎఫ్ తెలిపింది. అతన్ని హతమార్చడం ద్వారా హమాస్ దురాగతాల బాధితులకు న్యాయం జరిగిందని ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ (Israeli Defense Minister Katz) తెలిపారు. ఐఆర్జీసీ రెండవ డ్రోన్ యూనిట్ డిప్యూటీ కమాండర్ అమిన్ పౌర్ జోడాకిని సైతం ఇజ్రాయిల్ హతమార్చింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...