అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | స్టాక్ మార్కెట్(Stock market)లో మంగళవారం రెండు ఐపీవోలు లిస్టయ్యాయి. ఒకటి మెయిన్‌బోర్డుకు చెందినది కాగా మరొకటి ఎస్‌ఎంఈ ఐపీవో(IPO). మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నా రెండు కంపెనీలూ ఇన్వెస్టర్లకు ప్రారంభ లాభాలను అందించడం గమనార్హం.
IPO | ప్రొస్టార్మ్ ఇన్వెస్టర్లకు 20 శాతం లాభాలు..
ఇన్వర్టర్ల తయారీ కంపెనీ అయిన ప్రొస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్(Prostarm Info Systems) ఐపీవో ఇన్వెస్టర్లకు లాభాలను అందించింది. తొలిరోజే ఇన్వెస్టర్లు 20 శాతం వరకు లాభపడ్డారు. మార్కెట్ నుంచి రూ. 168 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. గతనెల 27 నుంచి 29 వరకు బిడ్లను ఆహ్వానించింది. చిన్న ఇష్యూ కావడంతో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. 39.48 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ప్రైస్(Issue price) ఒక్కో షేరుకు రూ.105 కాగా.. 19 శాతం ప్రీమియంతో రూ. 125 వద్ద లిస్టయ్యింది. అంటే ఒక్కో షేరుపై తొలిరోజే 20 రూపాయల లాభం వచ్చిందన్న మాట. ఆ తర్వాత రూ.126ను తాకి అప్పర్ సర్క్యూట్ కొట్టింది.
IPO | బ్లూ వాటర్‌లో లిస్టింగ్ గెయిన్స్ 4.4 శాతం..
మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సేవలందించే బ్లూ వాటర్ లాజిస్టిక్స్(Blue Water Logistics) ఎస్‌ఎంఈ కంపెనీ రూ. 40.50 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. గతనెల 27 నుంచి 29 వరకు బిడ్లను ఆహ్వానించగా.. రిటైల్ కోటా 6.55 టైమ్స్ ఓవర్ సబ్‌స్క్రైబ్(Over subscribe) అయ్యింది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఇష్యూ ప్రైస్ రూ. 135 కాగా.. 4.4 శాతం లాభంతో రూ. 141 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత రూ. 148 కి చేరి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.