Homeబిజినెస్​IPO | దుమ్ము రేపుతున్న ఐపీవోలు

IPO | దుమ్ము రేపుతున్న ఐపీవోలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్​లో (Domestic stock market) ఐపీవో(IPO)లు దుమ్ము రేపుతున్నాయి. ఈ నెలలో లిస్ట్ అయిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.

యూఎస్ టారిఫ్​ల అనిశ్చితితో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నా.. ఐపీవోలు మాత్రం ఇన్వెస్టర్లకు (Investors) లాభాల పంట పండిస్తున్నాయి. ఆగస్టులో మెయిన్ బోర్డు కు చెందిన ఆరు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో నాలుగు కంపెనీలు ప్రారంభ లాభాలను అందించాయి. ఒకటి నెగెటివ్​గా ప్రారంభమవగా.. మరొకటి ఫ్లాట్​గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాతా పెట్టుబడిదారులపై కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి.

Shanti Gold : శాంతి గోల్డ్ కంపెనీ ఈ నెల 1వ తేదీన లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఒక్కో ఈక్విటీ షేర్ ధరను గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 199గా నిర్ణయించగా.. రూ. 227 వద్ద లిస్టు అయ్యాయి. షేర్ ధర శుక్రవారం రూ. 239 వద్ద నిలిచింది.

Aditya Infotech : ఆదిత్య ఇన్ఫోటెక్ కంపెనీ షేర్లు ఈనెల 5వ తేదీన లిస్ట్ అయ్యాయి. ఐపీవో ప్రైస్ రూ. 675 కాగా.. రూ. 1,015 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. షేర్ ధర శుక్రవారం రూ. 1,090 వద్దకు చేరింది.

Laxmi India Finance : ఈనెల 5వ తేదీనే లిస్ట్ అయిన లక్ష్మి ఫైనాన్స్ కంపెనీ మాత్రం లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. కానీ తర్వాత కోలుకుంది. ఒక్కో షేర్ ధర రూ. 158 కాగా రూ. 137 వద్ద లిస్టు అయ్యింది. షేర్ ధర శుక్రవారం రూ. 161 వద్ద నిలిచింది.

NDSL : ఎన్డీఎస్ఎల్ కంపెనీ షేర్లు ఈనెల 6వ తేదీన లిస్ట్ అయ్యాయి. ఐపీవో ప్రైస్ రూ. 800 కాగా రూ. 880 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. షేర్ ధర శుక్రవారం రూ. 1,273 వద్ద స్థిరపడింది.

M&B Engineering : ఎం అండ్ బీ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు ఈనెల 6వ తేదీన లిస్ట్ అయ్యాయి. ఐపీవో ప్రైస్ రూ. 385 కాగా అదే ప్రైస్ వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి. షేర్ ధర శుక్రవారం రూ. 431 వద్ద ఉంది.

Sri Lotus Developers : శ్రీ లోటస్ డెవలపర్స్ కంపెనీ షేర్లు కూడా ఈనెల 6వ తేదీనే లిస్ట్ అయ్యాయి. ఐపీవో ప్రైస్ రూ. 150 కాగా రూ. 178 వద్ద లిస్ట్ అయ్యాయి. షేర్ ధర శుక్రవారం రూ. 209 వద్ద నిలిచింది.