Homeబిజినెస్​IPO | ఐపీవోలకు అద్భుత స్పందన.. భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన కంపెనీలు

IPO | ఐపీవోలకు అద్భుత స్పందన.. భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన కంపెనీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | ఈ వారంలో ఐపీవో(IPO)కు వచ్చిన మూడు మెయిన్‌బోర్డ్‌ కంపెనీలకు ఇన్వెస్టర్లనుంచి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని కంపెనీలు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ (Over subscribe) అయ్యాయి. అత్యధికంగా అర్బన్‌ కంపెనీ దాదాపు 109 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం ఈ కంపెనీ షేర్లకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో మెయిన్‌ బోర్డ్‌(Main board) నుంచి మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. మూడింటి బిడ్డింగ్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ సోమవారం రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీల షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈనెల 17న లిస్ట్‌ కానున్నాయి. అన్నింటికీ విశేష స్పందన లభించింది.

IPO | అర్బన్‌ కంపెనీ..

ఐపీవో ద్వారా రూ. 1,900 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో అర్బన్‌ కంపెనీ(Urban company) ఐపీవోకు వచ్చింది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ రూ. 472 కోట్లు కాగా.. మిగిలినది ఆఫర్‌ ఫర్‌ సేల్‌. కంపెనీ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరు(Equity share)కు రూ. 98 నుంచి రూ. 103 గా నిర్ణయించింది. ఈ కంపెనీకి విశేష స్పందన లభించింది. 108.98 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇందులో రిటైల్‌ కోటా 41.49 రెట్లు అయ్యింది. ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ ఉండడంతో జీఎంపీ(GMP) సైతం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈనెల 9న జీఎంపీ 35 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 54 శాతానికి చేరడం గమనార్హం.

IPO | శ్రింగర్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర

రూ. 400.95 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర(Shringar House of Mangalsutra) కంపెనీ ఐపీవోకు వచ్చింది. తాజా షేర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించింది. ధరల శ్రేణిని రూ.155 నుంచి రూ.165గా ఉంది. ఈ కంపెనీ షేర్లు మొత్తం 60 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కాగా.. రిటైల్‌ కోటా 27 సార్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. దీనికి జీఎంపీ 18 శాతంగా ఉంది.

IPO | దేవ్‌ యాక్సిలరేటర్‌..

దేవ్‌ యాక్సిలరేటర్‌(Dev Accelerator) కంపెనీ ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ. 143.35 కోట్లు సమీకరించింది. ధరల శ్రేణి రూ. 56 నుంచి రూ.61 గా ఉంది. ఈ కంపెనీ షేర్లు మొత్తం 64 టైమ్స్‌ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. చిన్న ఈక్విటీ కావడంతో రిటైల్‌ కోటా 167 సార్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ ఈనెల 9న 14 శాతం ఉండగా.. శనివారం నాటికి 16 శాతానికి పెరిగింది.

Must Read
Related News