ePaper
More
    Homeబిజినెస్​IPO | ఐపీవోల జాతర.. ఈవారంలో లిస్టింగ్‌కు సిద్ధంగా 19 కంపెనీలు

    IPO | ఐపీవోల జాతర.. ఈవారంలో లిస్టింగ్‌కు సిద్ధంగా 19 కంపెనీలు

    Published on

    IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో ఐపీవోల జాతర నడుస్తోంది. ఈ వారంలో ఏకంగా 19 కంపెనీలు లిస్టవనున్నాయి. ఇందులో 6 మెయిన్‌ బోర్డు ఐపీవో(IPO)లు కాగా.. మరో 13 ఎస్‌ఎంఈ ఐపీవోలు.

    మార్కెట్లనుంచి నిధులను సమీకరించడం కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా కొంతమేర నిధులను సమకూర్చుకోవడంతోపాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(Offer for sale) ద్వారా ప్రమోటర్లు కొంత మొత్తం వాటాను అమ్ముకోవడం కోసం ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తున్నాయి. ఈ వారంలో ఏకంగా 19 కంపెనీలు లిస్టింగ్‌కు సిద్ధంగా ఉండడం గమనార్హం. ఇవికాక మరో పది కంపెనీల సబ్‌స్క్రిప్షన్‌(Subscription) కొనసాగనుంది.

    IPO | మెయిన్‌ బోర్డులో..

    మెయిన్‌ బోర్డులో 6 కంపెనీలు లిస్ట్‌ కానున్నాయి. కల్పతరు(Kalpataru) కంపెనీ రూ. 1,590 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఐపీవో ద్వారా గ్లోబల్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ రూ. 119 కోట్లు, ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ కంపెనీ రూ. 452.5 కోట్లు సమీకరించనున్నాయి. ఈ కంపెనీల షేర్లు మంగళవారం ఎన్‌ఎస్‌ఈ(NSE), బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్‌(HDB financials) రూ. 12,500 కోట్లు, సంభవ్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ రూ. 540 కోట్లు సమీకరించనున్నాయి. ఈ కంపెనీల షేర్లు బుధవారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ(BSE)లలో లిస్ట్‌ అవుతాయి. రూ. 200 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చిన ఇండో గల్ఫ్‌ క్రాప్‌సైన్సెస్‌ షేర్లు గురువారం ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    IPO | ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో..

    ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో 13 కంపెనీలు లిస్ట్‌ కానున్నాయి. శ్రీహరికృష్ణ స్పాంజ్‌ ఐరన్‌ కంపెనీ(ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 28.39 కోట్లు, ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 18.15 కోట్లు, అబ్రం ఫుడ్‌((బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ)) కంపెనీ రూ. 13.29 కోట్లు, ఏజేసీ జెవెల్‌(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) కంపెనీ రూ. 14.59 కోట్లు సమీకరించనున్నాయి. ఆయా కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం(Tuesday) లిస్ట్‌ అవుతాయి.

    ఐపీవో ద్వారా రామా టెలికాం కంపెనీ(ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 23.87 కోట్లు, సూపర్‌ టెక్‌ ఈవీ(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 28.39 కోట్లు, సన్‌టెక్‌ ఇన్‌ఫ్రా(ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 42.16 కోట్లు సమీకరించనున్నాయి. ఈ కంపెనీలు బుధవారం లిస్ట్‌(List) కానున్నాయి.

    ప్రొ ఎఫ్‌ఎక్స్‌ టెక్‌(ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 38.21 కోట్లు, వాలెన్సియా ఇండియా కంపెనీ(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 46.49 కోట్లు, మూవింగ్‌ మీడియా ఇంటర్‌టైన్‌మెంట్‌ (ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 32.91 కోట్లు, ఏస్‌ ఆల్ఫా టెక్‌(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 30.40 కోట్లు సమీకరించడానికి ఐపీవోకు వచ్చాయి. ఈ కంపెనీలు గురువారం మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి.ఆడ్‌కౌంటీ మీడియా ఇండియా(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 47.83 కోట్లు, నీటూ యోషి(బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ) రూ. 73.14 కోట్లు సమీకరించనున్నాయి. ఇవి శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి.

    More like this

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్ లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్...

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...