ePaper
More
    Homeబిజినెస్​IPO | ఈవారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు తొమ్మిది కంపెనీల రాక

    IPO | ఈవారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు తొమ్మిది కంపెనీల రాక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో మూడు కంపెనీలు లిస్టవనుండగా.. తొమ్మిది కంపెనీల సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ప్రారంభం కానుంది. ఇందులో నాలుగు కంపెనీలు మెయిన్‌ బోర్డ్‌కు చెందినవి కాగా.. మరో ఐదు ఎస్‌ఎంఈ కంపెనీలు. పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న కంపెనీల వివరాలు తెలుసుకుందామా..

    IPO | మెయిన్‌బోర్డ్‌ ఐపీవోలు

    ఇండిక్యూబ్‌ స్పేసెస్‌ : మార్కెట్‌నుంచి రూ. 700 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇండిక్యూబ్‌ స్పేసెస్‌(Indiqube Spaces) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO subscription) బుధవారం ప్రారంభంకానుంది. ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ. 225- 237గా నిర్ణయించారు.

    జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌ : ఇన్వెస్టర్లనుంచి రూ. 460 కోట్లు సమీకరించే లక్ష్యంతో జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌(GNG Electronics) ఐపీవోకు వస్తోంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ సైతం బుధవారమే ఓపెన్‌ అవుతుంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 225- 237గా నిర్ణయించారు.

    READ ALSO  Today Gold Price | ల‌క్ష మార్క్​ను దాటేసిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు ఎంతంటే..!

    బ్రిగేడ్‌ హోటల్‌ వెంచర్స్‌ : రూ. 759.60 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వస్తున్న బ్రిగేడ్‌ హోటల్‌ వెంచర్స్‌(Brigade Hotel Ventures) ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ గురువారం మొదలవనుంది. ప్రైస్‌బాండ్‌ను ఇంకా ప్రకటించలేదు.

    శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్‌ : 1,80,96,000 ఈక్విటీ షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా జారీ చేయడం కోసం శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్‌(Shanti Gold International) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ ఐపీవో జూలై 25వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రైస్‌బాండ్‌ను ప్రకటించాల్సి ఉంది.

    IPO | ఎస్‌ఎంఈ ఐపీవోలు..

    సవీ ఇన్‌ఫ్రా అండ్‌ లాజిస్టిక్స్‌ : రియల్‌ ఎస్టేట్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో సేవలందిస్తున్న సవీ ఇన్‌ఫ్రా అండ్‌ లాజిస్టిక్స్‌(Savy Infra and Logistics) రూ. 69.98 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తుంది. కంపెనీ ప్రైస్‌ బాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 114 నుంచి రూ. 120 గా నిర్ణయించింది.

    READ ALSO  BHVL IPO | మార్కెట్​లోకి మరో ఐపీవో.. జూలై 24న ప్రారంభం కానున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ సబ్​స్క్రిప్షన్​

    స్వస్తిక కాస్టల్‌ : అల్యూమినియం కాస్టింగ్‌ రంగంలో సేవలు అందిస్తున్న స్వస్తిక కాస్టల్‌(Swastika Castal) రూ. 14.07 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ సైతం సోమవారం ప్రారంభమై బుధవారం ముగియనుంది. ఒక్కో షేరు ధర రూ. 54గా నిర్ణయించింది.

    మోనార్క్‌ సర్వేయర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ : మోనార్క్‌ సర్వేయర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌(Monarch Surveyors and Engineering Consultants) ఐపీవో మంగళవారం ప్రారంభమవుతుంది. టోపోగ్రాఫిక్‌ సర్వేలు, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ సేవలు అందించే ఈ కంపెనీ రూ. 93.75 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ప్రైస్‌ బ్యాండ్‌ ఒక్కో షేరుకు రూ. 237- 250గా ఉంది.

    టీఎస్‌సీ ఇండియా : రూ. 25.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో టీఎస్‌సీ ఇండియా(TSC India) ఐపీవోకు వస్తోంది. ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు, ప్రధానంగా బీ2బీ, కార్పొరేట్‌ సెక్టార్లకు ఎయిర్‌ టికెటింగ్‌ సర్వీసులు అందించే ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. ప్రైస్‌ బ్యాండ్‌ను రూ. 68-70గా నిర్ణయించారు.

    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    పటేల్‌ కెమ్‌ స్పెషాలిటీస్‌ : పటేల్‌ కెమ్‌ స్పెషాలిటీస్‌(Patel Chem Specialities) కంపెనీ ఇన్వెస్టర్లనుంచి రూ. 58.80 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ జూలై 25న మొదలై 29వ తేదీతో ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 82 నుంచి రూ. 84గా ఉంది. ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్‌ ఎక్సిపియెంట్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ, ఎగుమతి సర్వీసులు అందిస్తోంది.

    IPO | మూడు కంపెనీల లిస్టింగ్‌..

    ఈ వారంలో మూడు కంపెనీలు లిస్టింగ్‌కు రానున్నాయి. ఆంథెమ్‌ బయో సైన్సెస్‌(Anthem Biosciences), స్పన్‌వెబ్‌ నాన్‌ వోవెన్‌ల షేర్లు సోమవారం లిస్టవనున్నాయి. మోనికా అల్కోబెవ్‌ షేర్లు బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి.

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...