అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPO | సెకండరీ మార్కెట్లలో (Secondary market) అనిశ్చితి ఉన్నా.. ఐపీవోలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వారంలో పబ్లిక్ ఇష్యూకు (Public issue) ఐదు కంపెనీలు వస్తున్నాయి. ఫిజిక్స్‌వాలా, ఎమ్వీ ఫొటోవొల్టాయిక్ పవర్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, ఫుజియామా పవర్ సిస్టమ్స్, కాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోల సబ్‌స్క్రిప్షన్ (Subscription) ఈ వారంలో ప్రారంభం కానుంది.
IPO | ఫిజిక్స్‌వాలా..
ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ అయిన ఫిజిక్స్‌వాలా (PhysicsWallah) రూ. 3,480 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 3,100 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ. 380 కోట్లు సమీకరించనుంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 11 న ప్రారంభమై 13న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 14న రాత్రి వెల్లడవుతుంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 103 నుంచి రూ. 109 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 137 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్(Lot) కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద కనీసం రూ. 14,933తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు 18న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. కంపెనీ షేర్ల జీఎంపీ 3.67 శాతంగా ఉంది.
IPO | ఎమ్వీ ఫొటోవొల్టాయిక్ పవర్..
బెంగళూరుకు చెందిన సౌరశక్తి సంస్థ అయిన ఎమ్వీ ఫొటోవొల్టాయిక్ పవర్ (Emmvee Photovoltaic Power) ఐపీవో ద్వారా రూ. 2,900 వేల కోట్లను సమీకరించనుంది ఇందులో రూ. 2,143.86 కోట్లు ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 206 నుంచి రూ. 217గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 69 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బ్యాండ్(Price band) వద్ద ఒక లాట్ కోసం రూ. 14,973 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఈనెల 11న ప్రారంభమై 13న ముగుస్తుంది. కంపెనీ షేర్లు 18న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. కంపెనీ షేర్లకు జీఎంపీ 9.22 శాతంగా ఉంది.
IPO | టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా
వెహికల్ పార్టులు తయారు చేసే అమెరికన్ కంపెనీ టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా(Tenneco Clean Air India) లిమిటెడ్ రూ.3,600 కోట్లను సమీకరించడం కోసం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 12న తన ప్రారంభమవుతుంది. 14న ముగుస్తుంది. షేర్లు 19న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టవుతాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధర(Equity share price)ను రూ. 378 నుంచి రూ. 397 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 37 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,689 తో బిడ్ వేయాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) 16.88 శాతం ఉంది.
IPO | ఫుజియామా పవర్ సిస్టమ్స్..
ఆన్‌గ్రిడ్, ఆఫ్‌గ్రిడ్ మరియు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్‌లతో సహా రూఫ్‌టాప్ సోలార్ పరిశ్రమలో ఉత్పత్తులను తయారు చేసే ఫుజియామా పవర్ సిస్టమ్స్(Fujiyama Power Systems) కంపెనీ రూ. 828 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వస్తోంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 216 నుంచి రూ. 228 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 65 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు(Retail investors) ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 14,820 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్ 13న ప్రారంభమై 17 న ముగుస్తుంది. కంపెనీ షేర్లు 20వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
IPO | కాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా..
కస్టమర్ లాయల్టీ మరియు ఎంగేజ్‌మెంట్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన ప్రముఖ భారతీయ సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీ అయిన కాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా(Capillary Technologies) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ఈనెల 14న ప్రారంభమై 19న ముగుస్తుంది. కంపెనీ షేర్లు ఈనెల 21 న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి. రూ. 345 కోట్ల ఫ్రెష్ ఇష్యూతోపాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు 92 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ సైజ్, ప్రైస్ బ్యాండ్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడిరచాల్సి ఉంది.
