Homeబిజినెస్​IPO buzz | ఈ వారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు 21 కంపెనీలు

IPO buzz | ఈ వారంలోనూ ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు 21 కంపెనీలు

అక్షరటుడే, న్యూఢిల్లీ: IPO buzz | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో ఐపీవో సందడి కొనసాగుతోంది. ఈ వారంలో 21 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ(Public issue)కు వస్తున్నాయి.

ఇందులో ఐదు మెయిన్‌బోర్డ్‌ కంపెనీలు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందినవి. 24 కంపెనీలు లిస్టవనున్నాయి.

మెయిన్‌బోర్డ్‌(Main board)నుంచి ఐదు కంపెనీలు ఐపీవో(IPO)కు వస్తున్నాయి. ఫ్యాబ్‌ టెక్‌ టెక్నాలజీస్‌, గ్లాటిస్‌, అడ్వాన్స్‌ ఆగ్రో లైఫ్‌, ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌, వుయ్‌ వర్క్‌ ఇండియా కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ఈవారంలో మొదలవనుంది.

IPO buzz | గ్లాటిస్‌ లిమిటెడ్‌..

గ్లాటిస్‌ లిమిటెడ్‌(Glottis Ltd.) పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 29 న ప్రారంభమై అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మూడో తేదీన షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలిసే అవకాశాలుంటాయి.

కంపెనీ షేర్లు అక్టోబర్‌ 7న బీఎస్‌ఈ(BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 307 కోట్లు సమీకరించాలని లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది.

IPO buzz | ఫ్యాబ్‌టెక్‌ టెక్నాలజీస్‌..

ఫ్యాబ్‌టెక్‌ టెక్నాలజీస్‌(Fabtech Technologies) లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 230.35 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది.

సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 29 న ప్రారంభమై వచ్చేనెల ఒకటో తేదీన ముగుస్తుంది. కంపెనీ షేర్లు అక్టోబర్‌ 7న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ(NSE)లలో లిస్టవుతాయి.

ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌..

మార్కెట్‌నుంచి రూ. 122.31 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఓం ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌(Om Freight Forwarders) ఐపీవోకు వస్తోంది.

సోమవారం ప్రారంభమయ్యే బిడ్డింగ్‌ విండో బుధవారం వరకు తెరిచి ఉంటుంది. కంపెనీ షేర్లు అక్టోబర్‌ 7న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

అడ్వాన్స్‌ ఆగ్రో లైఫ్‌..

రూ. 192.86 కోట్లు సమీకరించడం కోసం అడ్వాన్స్‌ ఆగ్రో లైఫ్‌(Advance Agrolife) కంపెనీ ఐపీవోకు వస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంది. కంపెనీ షేర్లు అక్టోబర్‌ 8న లిస్టవుతాయి.

వుయ్‌ వర్క్‌ ఇండియా

వుయ్‌ వర్క్‌ ఇండియా(WeWork India) కంపెనీ ఐపీవో అక్టోబర్‌ 3వ తేదీన ప్రారంభమవుతుంది. 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

కంపెనీ షేర్ల అలాట్‌మెంట్‌ 8వ తేదీ రాత్రి వెల్లడవుతుంది. 10వ తేదీన కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఐపీవో సైజ్‌, ప్రైస్‌బాండ్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్‌ఎంఈ కంపెనీలు..

సోధని క్యాపిటల్‌, విజయ్‌పీడీ స్యూటికల్‌, సుబాహోటల్స్‌, ఓం మెటాలాజిక్‌, ధిల్లాన్‌ ఫ్రైట్‌ క్యారియర్‌, చిరాహరిట్‌, జీలియో ఈ మొబిలిటీ, షీల్‌ బయోటెక్‌(Sheel Biotech), మ్యూనిష్‌ ఫోర్జ్‌, వాల్‌ప్లాస్ట్‌ టెక్నాలజీస్‌, బీఏజీ కన్వర్జెన్స్‌, నస్‌స్కై లాజిస్టిక్స్‌, ఇన్ఫినిటీ ఇన్ఫోవే(Infinity Infoway), గ్రీన్‌ లీఫ్‌ ఎన్విరో టెక్‌, శ్లోక్కా డైస్‌, షిప్‌వేవ్స్‌ ఆన్‌లైన్‌ కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి.

లిస్టయ్యే కంపెనీలు..

  • మెయిన్‌బోర్డ్‌ నుంచి 11 కంపెనీలు లిస్టింగ్‌కు రానున్నాయి.
  • గణేశ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, అట్లాంటా ఎలక్ట్రికల్స్‌(Atlanta Electricals), శేషశాయి టెక్నాలజీస్‌(Seshaasai Technologies), సోలార్‌ వరల్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌, ఆనంద్‌ రాఠీ షేర్‌, జారో ఇన్‌స్టిట్యూట్‌, బీఎండబ్ల్యూ వెంచర్స్‌, జైన్‌ రిసోర్స్‌ రీసైక్లింగ్‌, ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ టెక్నాలజీస్‌, జిన్‌కౌషల్‌ ఇండస్ట్రీస్‌(Jinkushal Industries), ట్రాల్ట్‌ బయో ఎనర్జీల ఐపీవోలు ఈ వారంలో లిస్టవనున్నాయి.
  • ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌నుంచి 13 కంపెనీలు ఈ వారంలో లిస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ప్రైమ్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌, భరత్‌ రోహన్‌ ఎయిర్‌బోర్నే ఇన్నోవేషన్‌, ఆప్టస్‌ ఫార్మా, మ్యాట్రిక్స్‌ జియో సొల్యూషన్స్‌, ఎకోలైన్‌ ఎక్జిమ్‌, ట్రూ కలర్స్‌(True Colors), గురునానక్‌ అగ్రికల్చర్‌, సాల్వెక్స్‌ ఎడిబుల్స్‌, సిస్టమాటిక్‌ ఇండస్ట్రీస్‌, ప్రరుప్‌ టెక్నాలజీస్‌, జస్టో రియల్‌ ఫన్‌టెక్‌, టెల్గే ప్రాజెక్ట్స్‌, ఇయర్‌ కార్ట్‌, చాటర్‌బాక్స్‌ టెక్నాలజీస్‌(Chatterbox Technologies), గుజరాత్‌ పీనట్‌ లిస్టవనున్నాయి.
Must Read
Related News