అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Domestic Stock Market) మళ్లీ ఐపీవోల సందడి నెలకొంది. ఈవారంలో మెయిన్‌బోర్డ్‌నుంచి మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి.
గత రెండు వారాలుగా స్తబ్ధుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ కదలిక వచ్చింది. ఇన్వెస్టర్ల ముందుకు మూడు మెయిన్‌బోర్డ్(Mainboard) కంపెనీలు వస్తున్నాయి. ఎంటీఆర్ ఫుడ్స్ మాతృ సంస్థ ఓర్క్‌లా ఇండియాతోపాటు హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్, కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లు విక్రయించే లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ కంపెనీల ఐపీవో(IPO)లు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ కంపెనీలపై ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది.
IPO | ఓర్క్‌లా ఇండియా..
ఎంటీఆర్ ఫుడ్స్ పేరుతో ఇండియాలో ఫుడ్ ప్రొడక్ట్స్‌ను విక్రయించే నార్వేకు చెందిన ఓర్క్‌లా ఇండియా (Orkla India) కంపెనీ రూ. 1,667.54 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్(Subscription) విండో ఈనెల 29న ప్రారంభమై 31వ వరకు కొనసాగుతుంది. కంపెనీ షేర్లు నవంబర్ 6న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 14 శాతం ఉంది.
IPO | స్టడ్స్ యాక్సెసరీస్..
ప్రముఖ హెల్మెట్‌ల తయారీ సంస్థ అయిన స్టడ్స్ యాక్సెసరీస్(Studds Accessories) పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 445.49 కోట్లు సమీకరించనుంది. ఈనెల 30 నుంచి నవంబర్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్ విండో అందుబాటులో ఉంటుంది. కంపెనీ షేర్లు నవంబర్ 7న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవనున్నాయి. కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్ ప్రీమియం(GMP) 11 శాతం ఉంది.
IPO | లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్..
ప్రిస్కిప్షన్ కళ్లద్దాలు, సన్‌గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్‌లు, ఉపకరణాల తయారీ, విక్రయంలో తనదైన ముద్ర వేసిన లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Lenskart Solutions Ltd).. మార్కెట్‌నుంచి రూ. 7,278.02 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఈనెల 31న ప్రారంభమై వచ్చేనెల 4న ముగుస్తుంది. కంపెనీ షేర్లు నవంబర్ 10న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతాయి. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 17 శాతంగా ఉంది.

