Homeక్రీడలుIPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల...

IPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల చూడాలి!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో (GST system) సంచలనాత్మక మార్పులు తీసుకొచ్చింది. గడిచిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) కొత్త జీఎస్టీ శ్లాబ్‌లను ప్రకటించారు.

ప్రస్తుతం నాలుగు శ్లాబ్‌ల వ్యవస్థను తొలగించి, కేవలం రెండు శ్లాబ్‌లు మాత్రమే ఉంచారు. అవి 5 శాతం, 18 శాతం. ఈ మార్పులు ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో 5%, 12%, 18%, 28% శ్లాబ్‌లు ఉండ‌గా, ప్రస్తుతం కేవలం 5%, 18% మాత్రం ఉంచారు. జీరో ట్యాక్స్ పరిధిలోకి అనేక తినుబండారాలు, దినసరి వాడకపు ఉత్పత్తులు వ‌స్తాయి.

IPL Tickets | ఇలా అయితే క‌ష్ట‌మే..

అయితే కేంద్రం ప్రకారం, స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ (IPL matches) చూడడం విలాసవంతమైన కార్యకలాపంగా పరిగణించి, వాటిపై పన్ను రేటును 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. దీంతో టికెట్ ధరలపై ప్రభావం పడనుంది. గతంలో రూ. 1000 విలువైన టికెట్‌పై రూ. 280 జీఎస్టీ ఉండేది. కానీ ఇప్పుడు అదే టికెట్‌పై రూ. 400 జీఎస్టీనే చెల్లించాల్సి వ‌స్తుండ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

దీనివల్ల సామాన్య అభిమానులు, ముఖ్యంగా బడ్జెట్ లో ఉన్నవారు స్టేడియంకు వ‌చ్చి మ్యాచ్‌లు ఎలా చూస్తార‌ని అంటున్నారు. రూ. 500 టికెట్ ధ‌ర ఇప్పుడు రూ. 700 (పాత ధర రూ. 640), అలానే రూ.1,000 టికెట్ -ఇప్పుడు రూ.1,400 (పాత ధర రూ. 1,280), రూ.2,000 టికెట్ ఇప్పుడు రూ. 2,800 (పాత ధర రూ. 2,560). బీసీసీఐ, ఐసీసీ (BCCI and ICC) నిర్వహించే సాధారణ మ్యాచ్‌లు మాత్రం ఇప్పటికీ 18% జీఎస్టీ పరిధిలోనే ఉంటాయి. అంటే, జీఎస్టీ పెంపు కేవ‌లం ఐపీఎల్ టికెట్లకే పరిమితం చేశారు.

కొత్త జీఎస్టీ రేటుతో (new GST rate) ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు క్యాసినోలు, రేస్‌ క్లబ్బులు, లగ్జరీ గూడ్స్ వంటి లిస్ట్‌లో చేరాయి. ఈ పెంపు వల్ల స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవ‌కాశం ఉంద‌ని, దీనివల్ల ఆన్‌లైన్ స్ట్రీమింగ్ లేదా టీవీ వీక్షణకు ఎక్కువ మంది ఆస‌క్తి చూప‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏ వస్తువులు 40% శ్లాబ్‌లోకి వచ్చాయి? అంటే 350 సీసీకి పైగా బైక్స్‌, హెలీకాప్టర్లు, యాచ్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కెఫిన్ బేస్డ్ పానీయాలు, ఐపీఎల్ టికెట్లు. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు ఇప్పటికీ 40% శ్లాబ్‌లోకి మారలేదు.