అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2026 Mini Auction | అబుధాబి (Abu Dhabi) వేదికగా నిర్వహించిన ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఊహించని ధరలు, రికార్డు స్థాయి బిడ్లతో ఈ వేలం ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు దూకుడుగా వ్యవహరించి భారీగా ఖర్చు పెట్టాయి. మరోవైపు కొంతమంది ఆటగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టగా, మరికొంతమంది స్టార్ ప్లేయర్లు మాత్రం అన్‌సోల్డ్‌గా (unsold) మిగిలిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
IPL 2026 Mini Auction | అమ్ముడైన ఆటగాళ్లు (Sold Players)
IPL 2026 Mini Auction | బ్యాటర్లు
డేవిడ్ మిల్లర్ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
కామెరాన్ గ్రీన్ – రూ.25.20 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
IPL 2026 Mini Auction | బౌలర్లు
జాకబ్ డఫీ – రూ.2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మతీషా పతిరణ – రూ.8 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
అన్రిచ్ నోర్ట్జే – రూ. కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
రవి బిష్ణోయ్ – రూ.7.2 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
అకేల్ హోసేన్ – రూ. కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
IPL 2026 Mini Auction | ఆల్‌రౌండర్లు
వానిందు హసరంగా – రూ.2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
వెంకటేష్ అయ్యర్ – రూ. కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఔకిబ్ దార్ – రూ.8.4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ప్రశాంత్ వీర్ – రూ.14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
శివంగ్ కుమార్ – రూ.30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL 2026 Mini Auction | వికెట్ కీపర్లు
క్వింటన్ డి కాక్ – రూ.1 కోటి – ముంబై ఇండియన్స్
బెన్ డకెట్ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
ఫిన్ అలెన్ – రూ.2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
కార్తీక్ శర్మ – రూ.14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
ముకుల్ చౌదరి – రూ.2.6 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్
తేజస్వి సింగ్ – రూ.3 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
అన్‌సోల్డ్‌గా మిగిలిన ప్రముఖ ఆటగాళ్లు
IPL 2026 Mini Auction | బ్యాటర్లు
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, పృథ్వీ షా, డెవాన్ కాన్వే, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్ తదితరులు
IPL 2026 Mini Auction | బౌలర్లు
మ్యాట్ హెన్రీ, ఆకాష్ దీప్, జెరాల్డ్ కోట్జీ, ఫజల్హాక్ ఫారూఖీ, మహేష్ తీక్షణ, ముజీబ్ ఉర్ రెహమాన్
IPL 2026 Mini Auction | ఆల్‌రౌండర్లు
గస్ అట్కిన్సన్, రచిన్ రవీంద్ర, లియామ్ లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, విజయ్ శంకర్
IPL 2026 Mini Auction | వికెట్ కీపర్లు
కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్
ఈ మినీ వేలంలో యువ ఆటగాళ్లకు, ఫ్యూచర్ టాలెంట్‌కు జట్లు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో అనుభవజ్ఞులైన కొంతమంది అంతర్జాతీయ ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా Unsold మిగలడం పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా కామెరాన్ గ్రీన్, పతిరణ, కార్తీక్ శర్మలకు వచ్చిన భారీ ధరలు ఈ వేలానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .మొత్తంగా ఐపీఎల్ 2026 మినీ వేలం జట్ల వ్యూహాలు, కొత్త కాంబినేషన్లకు దారి తీస్తూ రానున్న సీజన్‌పై అంచనాలను మరింత పెంచింది.