Homeక్రీడలుIPL 2026 | డిసెంబర్ 14న ఐపీఎల్ మినీ వేలం.. రిటైన్షన్​ ఆటగాళ్ల జాబితా ఎప్పుడంటే?

IPL 2026 | డిసెంబర్ 14న ఐపీఎల్ మినీ వేలం.. రిటైన్షన్​ ఆటగాళ్ల జాబితా ఎప్పుడంటే?

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలను శనివారం సాయంత్రం 5 గంటలకు అధికారిక బ్రాడ్‌కాస్టర్లు స్టార్ స్పోర్ట్స్ మరియు జియో హాట్‌స్టార్ వేదికగా విడుదల చేయనున్నారు. మొత్తం 10 జట్ల రిటెన్షన్ లిస్టులతో పాటు, విడుదల చేస్తున్న ఆటగాళ్ల వివరాలూ ప్రకటించనున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2026 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2026 IPL 2026 మినీ వేలం (IPL 2026 mini auction) కోసం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈసారి వేలం డిసెంబర్ 14న అబుదాబిలో అట్ట‌హాసంగా జరుగనుంది.

వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు శనివారం (నవంబర్ 15) డెడ్‌లైన్ విధించబడింది. రిటెన్షన్‌లో ఎలాంటి పరిమితులు లేవు. మినీ వేలం కావడంతో, ఫ్రాంచైజీలకు ఆటగాళ్లను రిటైన్ చేయడంలో ఎలాంటి నిబంధనలు లేవు.జట్టుకు అవసరమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు నచ్చని లేదా ప్లాన్‌లో లేని ఆటగాళ్లను రిలీజ్ చేయ‌వ‌చ్చు.

IPL 2026 | ఈ రోజే రిటెన్ష‌న్..

ఎంత‌ మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలి, లేదా వదలాలి అనే విష‌యంలో పరిమితులు లేవు. అయితే, రిటెన్షన్ లిస్టు ప్రకటించేలోపే ట్రేడింగ్ (Trading) విండోలో క్యాష్ ట్రేడింగ్ డీల్స్ పూర్తిచేయాలి. మినీ వేలం జరిగే వరకు ట్రేడింగ్ విండో (Trading Window) మూసివేయబడుతుంది. అనంతరం మళ్లీ ట్రేడింగ్ కు అవకాశం ఉంటుంది. 10 ఫ్రాంచైజీల రిటెన్షన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో (Star Sports and Jio Hotstar) వీక్షించ‌వ‌చ్చు. ఈ రెండు వేదికల్లో చూడాలంటే చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ అవసరం. అయితే కొన్ని ప్రత్యేక జియో రీచార్జ్ ప్లాన్లతో జియో హాట్‌స్టార్ ఉచితంగా పొందచ్చు.

2025 సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లలో పెద్దగా మార్పులు లేకపోవచ్చని తెలుస్తోంది. కానీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్ల‌లో మాత్రం భారీ మార్పులు ఉండ‌బోతున్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది.

కొన్ని జట్లు రీ-బిల్డింగ్‌లోకి వెళ్లనున్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ, ట్రేడింగ్ విండో, మినీ వేలం రానున్న‌ రోజులలో క్రికెట్ ఫ్యాన్స్‌కి మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ముఖ్యంగా ఏ జట్లు స్టార్ ఆటగాళ్లను రిలీజ్ చేస్తాయి? ఎవరు వేలంలో హాట్ కేక్ అవుతారు? అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి.

Must Read
Related News