- Advertisement -
Homeక్రీడలుIPL | RCB vs RR మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

IPL | RCB vs RR మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL | ఐపీఎల్ ipl 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ RRతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం chinna swami stadium వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. మరోసారి రాజస్థాన్ రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ virat kohli (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జితేశ్ శర్మ(10 బంతుల్లో 4 ఫోర్లతో 20 నాటౌట్), టీమ్ డేవిడ్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో rastan bowlers సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.

- Advertisement -

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లకు 194 పరుగులకే పరిమితమైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. కృనాల్ పాండ్యా krunal pandya కు రెండు వికెట్లు దక్కగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.

IPL | మ్యాచ్ టర్నింగ్ పాయింట్

19వ ఓవర్‌ వరకు ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై చేయి సాధించింది. చివరి 12 బంతుల్లో ఆ జట్టు విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన ధ్రువ్ జురెల్‌, శుభమ్ దూబే ఉండటంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ 19వ ఓవర్‌లో జోష్ హజెల్ వుడ్ నిప్పులు చెరిగి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్ మూడో బంతికి ధ్రువ్ జురెల్‌ను వైడ్ యార్కర్ ద్వారా ఔట్ చేసిన హజెల్ వుడ్.. మరుసటి బంతికి ఆర్చర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి రెండు బంతులను కూడా కట్టడిగా వేసి ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఆర్‌సీబీకి చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్​లో తొలి విజయం దక్కింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News