- Advertisement -
Homeక్రీడలుRCB vs CSK: షెపర్డ్ భీభత్సం.. ఒకే ఓవర్‌లో 33 పరుగులు! (వీడియో)

RCB vs CSK: షెపర్డ్ భీభత్సం.. ఒకే ఓవర్‌లో 33 పరుగులు! (వీడియో)

- Advertisement -

Akshara Today: Rcb VS Csk : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ romario shepord (14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 నాటౌట్) భీభత్సం సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం చిన్నస్వామి స్టేడియంలో chinnaswamy stadium జరిగిన మ్యాచ్‌లో షెపర్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 16 నిమిషాలు మాత్రమే క్రీజులో ఉన్న షెపర్డ్.. 14 బంతులాడి 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో సీఎస్‌కే బౌలర్లను చెడుగుడు ఆడాడు.

అతని ధాటికి సీఎస్‌కే స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ bowler khaleel Ahmed ఒకే ఓవర్‌లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో షెపర్డ్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ నోబాల్‌తో కలిసి ఖలీల్ మొత్తం ఏడు బంతులు వేయగా.. షెపర్డ్ 6 బౌండరీలు కొట్టాడు. ఈ ఓవర్‌లో షెపర్డ్ వరుసగా 6, 6, 4, 6, 6nb, 0, 4 బౌండరీలు బాది 33 పరుగులు రాబట్టాడు. ఫ్రీ హిట్ బాల్ డాట్ కావడంతో ఖలీల్ బతికిపోయాడు.

- Advertisement -

షెపర్డ్ ధాటికి ఖలీల్ తన పేరిట చెత్త రికార్డ్‌ లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 65 పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సీఎస్‌కే తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గానూ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. రొమారియో షెఫర్డ్ విధ్వంసంతో ఆర్‌సీబీ ఆఖరి రెండు ఓవర్లలో 54 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ RCB నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ virat kohli (33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62), జాకోబ్ బెతెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News