ePaper
More
    Homeక్రీడలుIPL 2025 playoffs | ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఒక్క స్థానం కోసం ఆ మూడు...

    IPL 2025 playoffs | ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఒక్క స్థానం కోసం ఆ మూడు జ‌ట్లు పోటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ipl 2025 playoffs | ఐపీఎల్ 2025 (IPL 2025) భార‌త్ -పాక్ యుద్ధ పరిస్థితుల నేప‌థ్యంలో ఆగింది. వారం గ్యాప్ త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైంది. ఇక సీజన్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్లే ఆఫ్స్‌కి వెళ్లే జ‌ట్ల‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్​పై (delhi capitals) గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించ‌డంతో మూడు జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌ (gujarath titans), పంజాబ్ కింగ్స్‌ (punjab kings), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (royal challengers bangalore) జ‌ట్లు త‌మ ప్లేఆఫ్స్ స్థానాల‌ను ఖ‌రారు చేసుకోగా, నాలుగో స్థానం కోసం మూడు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఆ మూడు జ‌ట్లు ఏంటంటే.. ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్ర‌మించిన‌(eliminated from play offs) సంగ‌తి తెలిసిందే.

    ipl 2025 playoffs | ఆ ఒక్క స్థానం కోసం..

    ఈ సీజ‌న్‌లో ముంబై(mumbai indians) ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండ‌గా నెట్‌ ర‌న్‌రేట్ (net run rate) +1.156గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం నాలుగో స్థానంలో ఉంది. లీగ్ ద‌శలో ముంబై మ‌రో రెండు మ్యాచ్‌ల‌ను ఢిల్లీ, పంజాబ్ కింగ్స్‌తో (delhi and punjab kings) ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు 18 పాయింట్ల‌తో మిగిలిన జ‌ట్ల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేఆఫ్స్‌కు (play-offs) అర్హ‌త సాధించాలంటే.. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం ఐదో స్థానంలో ఉంది. కాగా.. లీగ్ ద‌శ‌లో ఢిల్లీ మ‌రో రెండు మ్యాచ్‌లు ముంబై, పంజాబ్​ల‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిస్తే 17 పాయింట్లతో ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

    ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు (luknow super gaints Play offs) అర్హ‌త సాధించాలంటే.. ల‌క్నో జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా, మ‌రో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ -0469గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది. ల‌క్నో మ‌రో మూడు మ్యాచ్‌లు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (gujarath titans and royal challengers bangalore)జ‌ట్ల‌తో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించినా కూడా మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ల‌క్నో ఖాతాలో 16 పాయింట్లు వ‌స్తాయి. అదే స‌మ‌యంలో ముంబైని ఢిల్లీ ఓడించాలి, పంజాబ్ చేతిలో ఓడిపోవాలి. ముంబై త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అప్పుడు ల‌క్నోకి 16 పాయింట్లు, ఢిల్లీకి 15 పాయింట్లు, ముంబైకి 14 పాయింట్లు ఉంటాయి. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...