ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ప్లే ఆఫ్స్‌కి వెళ్లే జ‌ట్ల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఆ నాలుగు జ‌ట్లు...

    IPL 2025 | ప్లే ఆఫ్స్‌కి వెళ్లే జ‌ట్ల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఆ నాలుగు జ‌ట్లు ఔట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :IPL 2025 | ఈ సీజ‌న్‌లో చాలా మ్యాచ్‌లు ఇంట్రెస్టింగ్‌గా సాగ‌డం మ‌నం చూశాం. ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్న జ‌ట్లు తుస్సుమ‌నిపించాయి. లీగ్ మ్యాచ్‌లలో దాదాపు మూడింట రెండు వంతులు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ప్రస్తుతం ఐపీఎల్ 2025లో 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గత సీజన్లలో 16 పాయింట్లు సాధించిన అన్ని జట్లు నేరుగా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు Play offs చేరుకోవ‌డం మ‌నం చూశాం. ఈ సారి మాత్రం గ‌ట్టి పోటీ ఉండ‌డంతో ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది అనేది చెప్ప‌డం కాస్త క‌ష్టంగా మారింది. గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఆ జట్టుకు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచినా గుజరాత్ టైటాన్స్ సులభంగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.

    IPL 2025 | వీటి మధ్య పోటీ..

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) విష‌యానికి వ‌స్తే ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 3 పరాజయాలను చవిచూసింది. 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మిగిలిన 3 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకెళ్లగలదు.మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) 12 మ్యాచ్ ల్లో 7 విజయాలు, 3 ఓటములతో 16 పాయింట్లు ద‌క్కించుకొని మూడో స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళ్లిపోతుంది. పంజాబ్ కింగ్స్ తమ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవల్సి ఉంటుది. నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది. ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశాన్ని దక్కించుకోగలదు.

    ప్రస్తుత పరిస్థితి సవాలుతో కూడుకుంది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals జట్లతో ఆడనుంది. ఆ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. అందువల్ల ఆ జట్లను ఓడించడం ముంబై ఇండియన్స్ జట్టుకు స‌వాల్‌తో కూడుకున్న‌దే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో 6 విజయాలు, 4 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ సంవత్సరం కేకేఆర్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్లేఆఫ్‌కు చేరుకునే అన్ని జట్లు కనీసం 16 పాయింట్లు సాధించాలి. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కూడా ముందుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని భావించారు.కాని ఈ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపుగా కష్టమే. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఇప్పటికే ముగిశాయి. ఇదివరకే రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు కూడా ముగిశాయి.

    Latest articles

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    More like this

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...