అక్షరటుడే, వెబ్‌డెస్క్ :IPL 2025 | గత రాత్రి ముంబై(Mumbai), ఢిల్లీ(Delhi) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ DC గెలిచి ఉంటే సమీకరణాలు వేరేలా ఉండేవి. కాని చేజింగ్‌లో ఢిల్లీ చతికిల పడడంతో ముంబై సులువుగా ప్లే ఆఫ్స్(Play Offs)కి వెళ్లింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. 59 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఢిల్లీ కొంపముంచినట్టైంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా.. ముంబైని అధిగమించే పరిస్థితి ఢిల్లీకి పోవడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక నాలుగు స్థానాలలో ఎవరెవరు ఉంటారు అనే దానిపై మరి కొద్ది రోజులలో క్లారిటీ రానుంది. ప్లే ఆఫ్స్‌లో ఏ జట్టు ఎవరితో పోరాడుతుంది అనేది మ్యాచ్‌లు అన్ని పూర్తైతే కాని క్లారిటీ రాదు. ఇప్పటికే ఆర్సీబీ,పంజాబ్, గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరుకున్న విషయం తెలిసిందే.
IPL 2025 | ప్లే ఆఫ్స్‌లో ఇవే..
ఇక ముంబయ్ MUMBAI వాంఖడే స్టేడియంలో ముంబయ్ ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎమ్ఐ(MI) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆదిలోనే ఢిల్లీ టీమ్ కు పెద్ద దెబ్బ తగిలింది.. ఓపెనర్లు కేఎల్ రాహుల్(11), ఫాఫ్ డుప్లెసిస్(6) తీవ్రంగా నిరాశపరచడంతో ఢిల్లీ ఇబ్బందుల్లో పడింది. అభిషేక్ పోరెల్(6) కూడా ఔటవ్వడంతో పవర్ ప్లేలోనే ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఆ వెంటనే నిలకడగా ఆడిన విప్రజ్ నిగమ్‌ను మిచెల్ సాంట్నర్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ట్రిస్టన్ స్టబ్స్(2)ను బుమ్రా ఔట్ చేయడంతో ఢిల్లీ 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరలో ముధవ్ తివారి, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను బుమ్రా పెవిలియన్ చేర్చి ముంబై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబయ్ ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఒక్కడే దూకుడుగా ఆడాడు. సూర్య 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73* రన్స్ చేశాడు. నమన్ ధీర్ (24*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్‌టన్ (25), విల్ జాక్స్ (21), తిలక్ వర్మ (27) పరుగులు చేశారు. రోహిత్ శర్మ (5), హార్దిక్ పాండ్య (3) మరోసారి నిరాశపర్చారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 Mukesh Kumar, చమీర, ముస్తాఫిజుర్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. చివరి రెండు ఓవర్లలో ఎమ్ఐ బ్యాటర్లు 48 పరుగులు పిండుకున్నారు. అదే ఆ జట్టును కాపాడాయి. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కొంపముంచాడు.