పెద్దప్రేగు క్యాన్సర్ తో పెద్దప్రేగులో కణితులు(కంతులు) పెరుగుతాయి
పెద్దప్రేగు క్యాన్సర్ తో పెద్దప్రేగులో కణితులు(కంతులు) పెరుగుతాయి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) Kolkata Knight Riders (KKR) పోరాటం ముగిసింది. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో శనివారం బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. కుండపోత వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా.. వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. రాత్రి 10.30 గంటలకు వరకు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎంతకీ తగ్గకపోవడం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో లభించిన పాయింట్‌తో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. 12 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ 8 విజయాలు.. ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. టాప్-2లో నిలవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆర్‌సీబీ గెలవాలి.

మరోవైపు కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు మ్యాచ్‌ల రద్దుతో 12 పాయింట్స్‌తో టేబుల్‌లో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)తో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచినా కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్స్ ఉంటాయి. ఇప్పటికే టాప్-4లో ఉన్న జట్లు 14, 14 కంటే ఎక్కువ పాయింట్స్‌తో పాటు మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నాయి. కాబట్టి కేకేఆర్ 14 పాయింట్స్ సాధించినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.