Ipl 2025 gujarat titans knocked out | గుజ‌రాత్ ఓట‌మితో వెక్కి వెక్కి ఏడ్చిన ఆశిష్ నెహ్రా కుమారుడు, కూతురు..!
Ipl 2025 gujarat titans knocked out | గుజ‌రాత్ ఓట‌మితో వెక్కి వెక్కి ఏడ్చిన ఆశిష్ నెహ్రా కుమారుడు, కూతురు..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఐపీఎల్ 2025లో గుజ‌రాత్ టైటాన్స్ Gujarat Titans జ‌ట్టు ప్ర‌యాణం ముగిసింది. లీగ్స్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ప్లేఆఫ్స్‌కి చేరుకున్న ఈ జ‌ట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)పై 20 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

దీంతో ముంబై జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే గెలిచే మ్యాచ్‌ని చేజాతులారా పోగొట్టుకుంది గుజ‌రాత్ జ‌ట్టు. బౌలింగ్‌లో పేలవ ఫీల్డింగ్‌ కారణంగా 20 పరుగులు అదనంగా ఇచ్చారు. రోహిత్ శ‌ర్మ‌వి రెండు సునాయాస క్యాచ్‌లు వ‌దిలేయ‌డంతో మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. సీజన్‌లో తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని అన్నాడు గిల్.

Ipl 2025 | ఫుల్ ఎమోష‌న‌ల్..

“తృటిలో విజయాన్ని చేజార్చుకున్నాం. చివరి 3-4 ఓవర్లు మాకు కలిసి రాలేదు. అయినా మేం బాగా ఆడాం. మేం మూడు సునాయస క్యాచ్‌లు వదిలేసాం. పవర్ ప్లేలోనే ఈజీ క్యాచ్‌లు వదిలేస్తే బౌలర్లు పరుగులను నియంత్రించలేరు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ Sundar అద్భుతంగా ఆడారు..” అంటూ మ్యాచ్ అనంత‌రం గిల్ అన్నాడు.

అయితే గుజ‌రాత్ ఓట‌మితో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ఓటమి తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కూతురు, కొడుకు బోరున విలపించారు. శుభ్‌మన్ గిల్ సోదరి కూడా గుజరాత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ సమయంలో షహ్నీల్ గిల్ కూడా ఆశిష్ నెహ్రా కూతురిని ఓదారుస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ Rohit Sharma , జానీ బెయిర్‌స్టో కలిసి 7.1 ఓవర్లలో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత బెయిర్‌స్టో 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ రోహిత్ శర్మ 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేయ‌డంతో 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఈ క్రమంలో గుజరాత్ ఆటగాళ్లు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు చేసినప్పటికీ.. గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.