ePaper
More
    HomeతెలంగాణIPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాపార్డర్ వైఫల్యంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది.

    హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు తప్పిదాలు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఓటమిని శాసించాయి.

    IPL 2025 | టాస్ ఓడిపోవడం

    ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం సన్‌రైజర్స్(Sunrisers) పతనాన్ని శాసించింది. టాస్ గెలిచిన ముంబై.. పిచ్ కండిషన్స్‌ను పసిగట్టి బౌలింగ్(Bowling) ఎంచుకుంది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకుంది. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టాస్ సందర్భంగా ప్యాట్ కమిన్స్(Pat Cummins) కూడా తెలిపాడు. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి(Sunrisers Head Coach Daniel Vettori) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. టాస్ ఓడిపోవడం మా ఓటమిని శాసించిందని చెప్పాడు.

    IPL 2025 | టాపార్డర్ వైఫల్యం

    పిచ్ కండిషన్స్‌(Pitch Conditions)ను పరిగణలోకి తీసుకోకుండా.. దూకుడు అప్రోచ్‌తో సన్‌రైజర్స్ టాపార్డర్ బ్యాటర్లు గుడ్డి ఊపుడు ఊపి వికెట్లు పారేసుకున్నారు. ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2) దారుణంగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ నిప్పులు చెలరేగడంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ టాప్-4 బ్యాటర్లలో ఏ ఈ ఇద్దరూ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడినా ఫలితం మరోలా ఉండేది.

    IPL 2025 | పేలవ బౌలింగ్

    హెన్రీచ్ క్లాసెన్(Heinrich Klaasen) సూపర్ బ్యాటింగ్‌తో 143 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకున్న సన్‌రైజర్స్.. బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కనీస పోరాట పటిమ కనబర్చలేదు. ముంబై బౌలర్లు చెలరేగిన పిచ్‌పై సన్‌రైజర్స్ బౌలర్లు తడబడ్డారు. దాంతో రోహిత్ శర్మ(Rohit Sharma) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించగా.. సూర్య తనదైన శైలిలో చెలరేగాడు. ముంబై బౌలర్ల తరహాలో సన్‌రైజర్స్ బౌలర్లు పవర్ ప్లేలో చెలరేగి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది.

     

    Latest articles

    Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేత జగదీష్​ రెడ్డి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    More like this

    Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేత జగదీష్​ రెడ్డి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...