అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (CSK captain mahendra singh dhoni) చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 100 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ( IPL 2025 season) భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ( kolkata knight riders) బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ 17 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ధోనీ తర్వాత.. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా 80 సార్లు అజేయంగా (CSK player ravindra jadeja 80 times not out) నిలిచి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అజింక్యా రహానే (ajinkya rahane)(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), ఆండ్రీ రస్సెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), మనీష్ పాండే(manish pandey)(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 36 నాటౌట్) రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ (noor ahmed)(4/31) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం సీఎస్‌కే 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసి గెలుపొందింది. డెవాల్డ్ బ్రెవిస్(dewald brevis)(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52), అరంగేట్ర ప్లేయర్ ఉర్విల్ పటేల్(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 31), శివమ్ దూబే(40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో (KKR bowlers) వైభవ్ అరోరా(3/48) మూడు వికెట్లు తీసినా ఫలితం దక్కలేదు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది.