ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | రివైజ్డ్ షెడ్యూల్.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

    IPL 2025 | రివైజ్డ్ షెడ్యూల్.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీజన్‌ శనివారం(మే 17) నుంచి మళ్లీ మొదలవ్వనుంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఐపీఎల్ 2025 సీజన్ రివైజ్డ్ షెడ్యూల్‌(Revised schedule)ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సోమవారం రాత్రి ప్రకటించింది.

    ఈ షెడ్యూల్ ప్రకారం బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వేదికగా మొత్తం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 3న ఫైనల్ మ్యాచ్(Final Match) జరగనుండగా.. ప్లే ఆఫ్స్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. భద్రతా కారణాలతో రద్దయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌ను జైపూర్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే ఈ రివైజ్డ్ షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. హైదరాబాద్(Hyderabad), వైజాగ్‌(Vizag)లకు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు. అంతేకాకుండా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఆడాల్సిన 2 మ్యాచ్‌లను కూడా తరలించారు.

    భారత్-పాకిస్థాన్(India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో సౌతిండియా నగరాల్లోనే మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ లెక్కన హైదరాబాద్, వైజాగ్ వేదికగా మరిన్ని మ్యాచ్‌లు జరుగుతాయని ఫ్యాన్స్ ఆశించారు. కానీ రివైజ్డ్ షెడ్యూల్ బెంగళూరు మినహా సౌతిండియాలో మరే నగరానికి ఒక్క మ్యాచ్‌ కేటాయించలేదు. వర్షాల ప్రభావంతోనే సౌతిండియాను బీసీసీఐ(BCCI) పట్టించుకోలేదని తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా జరగాల్సిన రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను కూడా తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఐపీఎల్ 2025 రివైజ్డ్ షెడ్యూల్ ఇదే..

    మే 17: ఆర్‌సీబీ vs కేకేఆర్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)

    మే 18: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, జైపూర్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)

    మే 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

    మే 19: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో (రాత్రి 7:30 గంటలకు)

    మే 20: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

    మే 21: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై (రాత్రి 7:30 గంటలకు)

    మే 22: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ (రాత్రి 7:30 గంటలకు)

    మే 23: ఆర్‌సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు (రాత్రి 7:30 గంటలకు)

    మే 24: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)

    మే 25: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
    మే 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కేకేఆర్, ఢిల్లీ (రాత్రి 7:30 గంటలకు)

    మే 26: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, జైపూర్ (రాత్రి 7:30 గంటలకు)

    మే 27: లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్‌సీబీ, లక్నో (రాత్రి 7:30 గంటలకు)

    మే 29: క్వాలిఫయర్ 1 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

    మే 30: ఎలిమినేటర్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

    జూన్ 1: క్వాలిఫయర్ 2 (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

    జూన్ 3: ఫైనల్ (వేదిక ఇంకా నిర్ణయించలేదు, రాత్రి 7:30 గంటలకు)

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...