ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | అదే జరిగితే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై ఔట్!

    IPL 2025 | అదే జరిగితే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై ఔట్!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2025 | అదే జరిగితే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై ఔట్! ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ (mumbai indians) జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగిన ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (gujarath titans) కళ్లెం వేసింది. ఈ సీజన్‌లో వరుసగా ఏడో విజయం సాధించి తిరిగి పాయింట్స్ టేబుల్‌లో (points table) అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ (play offs birth) దక్కించుకోవాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ షాకిచ్చింది. మంగళవారం వాంఖడే వేదికగా (wankhede stadium) ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన (Duckworth-Lewis method) ముంబై ఇండియన్స్‌‌ను మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓడించింది.

    వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చిరస్మరణీయ విజయాన్నందుకుంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా చేజార్చుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు (Mumbai Indians play-off chances) సంక్లిష్టంగా మారాయి. 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. ఒకటి గెలిచినా.. రెండు ఓడినా ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై (net run rate) ఆధారపడాల్సి ఉంటుంది.

    ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో (points table) అగ్రస్థానంలో ఉన్న గుజరాత్, ఆర్‌సీబీ (RCB) ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరువయ్యాయి. మిగతా రెండు స్థానంలో కోసం పంజాబ్, ముంబై, ఢిల్లీ, కేకేఆర్, లక్నో పోటీపడుతున్నాయి. ముంబై తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్, ఢిల్లీతో (Punjab and Delhi) తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై గెలిస్తే 18 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేస్తోంది. అలా కాకుండా ఓడితే మాత్రం.. పంజాబ్, ఢిల్లీ ముంబై కంటే రేసులో ముందు ఉంటాయి. అప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

    Latest articles

    Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేత జగదీష్​ రెడ్డి...

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    More like this