Homeటెక్నాలజీApple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.....

Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone 17 సిరీస్ చివరకు అధికారికంగా లాంచ్ అయింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు యాపిల్ ప్రధాన కార్యాలయం, కుపెర్టినోలో జరిగిన ఈవెంట్‌లో నాలుగు కొత్త మోడల్స్‌ను ఆవిష్కరించారు.

ఈ సారి Apple కొత్తగా తీసుకొచ్చిన iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్‌తో అభిమానులను అలరించింది. గతంలో ఉన్న ప్లస్ మోడల్‌ను తొలగించి, అందుకు బదులుగా సరికొత్త “Air” వేరియంట్‌ను తీసుకువచ్చారు.

ఈ ఈవెంట్‌లో iPhonesతో పాటు Air Pods Pro 3, Apple Watch Series 11, SE3 Watch మోడల్స్ కూడా లాంచ్ చేశారు. ఈ సిరీస్ ఫోన్ల కోసం సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

iPhone 17: స్టాండర్డ్ కానీ స్టైలిష్ మోడల్

  • డిస్‌ప్లే: 6.3 అంగుళాల Always-On, 120Hz రిఫ్రెష్‌రేట్
  • డిజైన్: అల్యూమినియం + గ్లాస్ ఫినిషింగ్, 7.3mm మందం
  • చిప్‌సెట్: లేటెస్ట్ A19 Bionic, 8GB RAM
  • కెమెరా: వెనుక 48MP + 12MP డ్యూయల్, ముందు 12MP సెంటర్ స్టేజ్ కెమెరా
  • ధర (భారత్‌లో): ₹82,900 (256GB)
  • రంగులు: లావెండర్‌, తెలుపు, మిస్ట్ బ్లాక్‌, సేజ్

iPhone 17 Air: అత్యంత సన్నని ఐఫోన్

  • ముందుగా గుర్తించాల్సింది: కేవలం 5.6mm మందం మాత్రమే
  • ఫ్రేమ్: టైటానియం బాడీ, సిరామిక్ షీల్డ్
  • చిప్‌సెట్: A19 Pro, అత్యంత శక్తివంతమైన చిప్
  • కెమెరా: 48MP ఫ్యూజన్ కెమెరా (బ్యాక్), 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్
  • ధర (భారత్‌లో): ₹1,19,900 (256GB)
  • రంగులు: స్పేస్ బ్లాక్‌, క్లౌడ్ వైట్‌, స్కై బ్లూ‌, లైట్ గోల్డ్

iPhone 17 Pro: పవర్ & ప్రెసిషన్

  • డిస్‌ప్లే: 6.3 అంగుళాల Always-On, ProMotion టెక్నాలజీ
  • డిజైన్: యాంటీ-రిఫ్లెక్టివ్, అల్యూమినియం + గ్లాస్, 8.7mm మందం
  • RAM: 12GB
  • చిప్‌సెట్: A19 Pro
  • కెమెరా:
  • వెనుక: 48MP + 48MP + 48MP ట్రిపుల్ కెమెరా సెటప్
  • ముందు: 18MP సెంటర్ స్టేజ్
  • వీడియో ఫీచర్స్: 8K రికార్డింగ్, డ్యూయల్ కెమెరా రికార్డింగ్
  • ధర (భారత్‌లో): ₹1,34,900 (256GB)
  • రంగులు: డీప్ బ్లూ‌, సిల్వర్‌, కాస్మిక్ ఆరెంజ్

 iPhone 17 Pro Max: హైఎండ్ ఫ్లాగ్‌షిప్ బీస్ట్

  • డిస్‌ప్లే: 6.9 అంగుళాల Always-On, ProMotion + Anti-Reflective
  • చిప్‌సెట్: A19 Pro
  • కూలింగ్: వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్
  • బ్యాటరీ: ఇప్పటివరకు ఐఫోన్‌లో అత్యధిక కెపాసిటీ
  • ధర (భారత్‌లో): ₹1,49,900 (256GB)
  • రంగులు: సిల్వర్‌, కాస్మిక్ ఆరెంజ్‌, డీప్ బ్లూ

అంతర్జాతీయ ధరలు (Starting Price):

  • iPhone 17 – $799
  • iPhone 17 Air – $999
  • iPhone 17 Pro – $1099
  • iPhone 17 Pro Max – $1199
  • లాంచ్ & బుకింగ్ వివరాలు
  • ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం: సెప్టెంబర్ 12 (శుక్రవారం)
  • అధికారిక అమ్మకాలు ప్రారంభం: సెప్టెంబర్ 19

మొత్తం మీద, Apple ఈసారి డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా iPhone Air మరియు 17 Pro మోడల్స్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.