అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delhi | దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి పాశవిక ఘటన చోటుచేసుకుంది. స్నేహితులపై నమ్మకంతో పార్టీకి వెళ్లిన ఓ యువతి, మానవత్వం మరిచిన నలుగురు యువకుల చేతిలో భయంకరమైన నరకాన్ని అనుభవించింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో (Civil Lines area) ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ప్రజల్ని ఆవేశానికి గురి చేస్తోంది. 24 ఏళ్ల యువతి, తన స్నేహితుడు ఇచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో నిర్వహించిన పార్టీకి వెళ్లింది. అక్కడ అప్పటికే మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. పార్టీ (Party) పేరుతో ఆమెకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో (Cool Drink) మత్తుమందు కలిపారు. ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే యువతి స్పృహ కోల్పోయింది.
Delhi | అత్యాచారం చేస్తూ వీడియో..
ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బాత్రూమ్‌కు (Bathroom) తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ దారుణాన్ని వీడియో తీసి (Video Record) భద్రపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు, తీవ్ర మానసిక వేదనతో తన సోదరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు (Police Station) వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళా సెక్యూరిటీ విభాగానికి చెందిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే ఆమెకు సంబంధించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
సీసీటీవీ ఫుటేజ్‌ల (CCTV Footage) ఆధారంగా నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల ఎవరు, ఎక్కడ ఉన్నారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో (POCSO Act), అత్యాచారం, మత్తుమందుల వినియోగం, క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీలో మహిళల భద్రతకి సంబంధించిన ఈ ఘటనపై పోలీసు (Police) ఉన్నతాధికారులు స్పందిస్తూ .. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆమె మానసికంగా తీవ్రంగా వేదనలో ఉంది. ఆమెకు అన్ని విధాలా మద్దతు అందించాం. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తాం. వీడియోలు, ఫోరెన్సిక్ ఆధారాల మీద గట్టి ఆధారాలు సేకరిస్తున్నాం,” అని తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ దేశ రాజధానిలో చోటుచేసుకోవడం న్యాయవ్యవస్థ, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వంపై ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగిస్తోంది. యువతిపై జరిగిన దారుణంపై నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ శిక్షార్హులపై కఠిన శిక్ష అమలవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.