అక్షరటుడే, గాంధారి: Temple inauguration | మండలకేంద్రంలోని నారాయణగిరి కొండపై మార్కండేయ ఆలయ (markandeya temple) ప్రారంభోత్సవానికి రావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఐ సంతోష్ కుమార్ (CI santhosh kumar), ఎస్సై ఆంజనేయులును (SI anjaneyulu) కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 12, 13, 14 తేదీల్లో ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని, పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి కుల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.