అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై కొత్త సుంకాలు విధిస్తామన్న యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దీనికితోడు కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై దృష్టి సారించడంతో మార్కెట్లు స్వల్ప రేంజ్లో కదలాడుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 124 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 367 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకుని 70 పాయింట్లు క్షీణించింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 110 పాయింట్లు లాభపడిరది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 85,688 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 26,319 వద్ద ఉన్నాయి.
కోలుకున్న ఎఫ్ఎంసీజీ సెక్టార్
ఎఫ్ఎంసీజీ(FMCG) సెక్టార్ రెండు సెషన్ల తర్వాత కోలుకుని లాభాల బాటలో సాగుతోంది. బీఎస్ఈలో రియాలిటీ ఇండెక్స్ 1.71 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 1.30 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.90 శాతం, ఆటో 0.77 శాతం, కమోడిటీ 0.64 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.53 శాతం, పీఎస్‌యూ 0.49 శాతం లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 1.16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.49 శాతం, టెలికాం 0.41 శాతం, ఇన్ఫ్రా 0.40 శాతం, పవర్ 0.36 శాతం, యుటిలిటీ 0.31 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 కంపెనీలు లాభాలతో ఉండగా.. 11 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
బీఈఎల్ 3.24 శాతం, మారుతి 1.71 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.59 శాతం, ఆసియా పెయింట్ 1.59 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.56 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 2.37 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.13 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.76 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.02 శాతం, ఎటర్నల్ 1.02 శాతం నష్టాలతో ఉన్నాయి.