అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | చైనా జపాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు (Asian Stock Markets) ఒత్తిడికి లోనవుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 93 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్‌పై స్పష్టత రాకపోవడం, రష్యానుంచి ఆయిల్ కొనగోళ్లను ఆపకపోతే కొత్త సుంకాలను విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటనకు తోడు గ్లోబల్‌గా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతుండడంతో మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 443 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 84,617 నుంచి 85,075 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 26,096 నుంచి 26,187 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 84,969 వద్ద, నిఫ్టీ (Nifty) 33 పాయింట్ల నష్టంతో 26,145 వద్ద ఉన్నాయి.
ఐటీలో దూకుడు..
ఐటీ ఇండెక్స్ దూకుడు మీదుంది. బీఎస్‌ఈలో ఐటీఈ ఇండెక్స్ 1.93 శాతం పెరిగింది. కన్జూమర్ డ్యూరెబుల్ 1.34 శాతం, హెల్త్‌కేర్ 0.42 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ 0.82 శాతం, టెలికాం 0.77 శాతం, ఆటో 0.53 శాతం, ఇన్‌ఫ్రా 0.53 శాతం, పవర్ 0.39 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.23 శాతం నష్టంతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం లాభంతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో ఉండగా.. 20 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
టైటాన్ 4.44 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.87 శాతం, టెక్ మహీంద్రా 1.77 శాతం, ఎటర్నల్ 1.70 శాతం, ఇన్ఫోసిస్ 1.48 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 2.09 శాతం, మారుతి 1.44 శాతం, ఎన్టీపీసీ 1.23 శాతం, కొటక్ బ్యాంక్ 1.22 శాతం, పవర్‌గ్రిడ్ 1.19 శాతం నష్టాలతో ఉన్నాయి.