అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apple సీఈవో Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. గురువారం(జులై 31) జరిగిన Apple త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా టిమ్‌కుక్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయం తెలుస్తోంది.
కుపర్టినో కేంద్రంగా పనిచేస్తున్న ఈ టెక్ దిగ్గజం.. AI రంగంలో మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు విలీనాలు (mergers), సంస్థల కొనుగోళ్లకు (acquisitions) కూడా సిద్ధంగా ఉందని Cook పేర్కొన్నారు.
Apple : ఏడు కంపెనీలను కొనుగోలు చేసిన Apple
ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 7 చిన్న కంపెనీలను Apple కొనుగోలు చేసిందని చెబుతున్నారు. “మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే సంస్థలను మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు కొనుగోలు చేసిన కంపెనీలు చిన్నవే.. కానీ కంపెనీ పరిమాణాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకోవడం లేదన్న విషయాన్ని గుర్తించాలి..” అని టిమ్‌కుక్ అన్నారు.
Apple : AI పై పెరుగుతున్న పెట్టుబడి, ఉద్యోగుల మళ్లింపు
AI పై ఆపిల్ పెట్టుబడులు పెరిగాయి. దీనికితోడు సంస్థ ఉద్యోగులను సైతం AI పై పని చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కచ్చితంగా ఈ పెట్టుబడులు ఎలా ఉపయోగపడతాయనేది చెప్పలేదు. కానీ, ఈ త్రైమాసికంలో కొన్ని మూలధన వ్యయాలు (capital expenditure) Private Cloud Compute పై ఖర్చు అవుతాయని టిమ్ Cook చెప్పుకొచ్చారు.
Apple : AI అత్యంత ప్రభావవంతమైన సాంకేతికత..
AI.. మన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతికతలలో ఒకటని టిమ్‌కుక్ పేర్కొన్నారు. ఇది అన్ని పరికరాలపై గణనీయంగా ప్రభావం చూపుతోందన్నారు. తమ దృష్టిలో AI అనేది వ్యక్తిగతంగా, ప్రైవేటుగా, ప్లాట్‌ఫారమ్‌లో సులభంగా కలిసిపోయేలా ఉండాలని Tim Cook వెల్లడించారు.
Apple : AI రేసులో పోటీకి సిద్ధం
OpenAI, Google, Anthropic వంటి AI దిగ్గజాలతో పోటీపడటానికి Apple సంస్థ ముమ్మరంగా ప్రణాళికలు సిద్ధం వేస్తోంది. ఇప్పటికే OpenAIతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన ఆపిల్.. ChatGPT ని తన పరికరాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. Anthropic సంస్థతో సైతం చర్చలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది.