అక్షరటుడే, భిక్కనూరు: Siddha Rameshwara Temple | సిద్దరామేశ్వరాలయంలో అక్రమాలపై విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు (Telangana Endowments Minister Konda Surekha) భిక్కనూరు మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల ఆలయం హుండీ లెక్కింపును చేపట్టారని వివరించారు. ఈ సమయంలో అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి చేతివాటం ప్రదర్శించగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పట్టుకున్నారన్నారు. ఈ విషయమై మహేందర్‌రెడ్డి ఆలయ ఈవో శ్రీధర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. చేతివాటం ప్రదర్శించిన వ్యక్తితో పాటు, అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Siddha Rameshwara Temple | సిద్దరామేశ్వరాలయంలో అక్రమాలపై విచారణ జరిపించాలి
6
previous post