SP Rajesh Chandra
SP Rajesh Chandra | కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలి

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్​తో (Quality Investigation) పాటు పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి ఛార్జీషీట్​ వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశోధించి ఫైనల్ చేయాలని సూచించారు.

SP Rajesh Chandra | పెండింగ్​ కేసులపై ప్రత్యేకదృష్టి..

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని స్థాయిల అధికారులను ఆదేశించారు. పాత, కొత్త కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే దిశగా పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉండి, సత్వర న్యాయం అందించాలన్నారు. చోరీ, ఆస్తి సంబంధిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, కొత్తగా వచ్చిన AMBIS టెక్నాలజీని వినియోగించి ఛాన్స్ ప్రింట్ ద్వారా కేసులను ఛేదించాలని సూచించారు.

ఎన్డీపీఎస్ (NDPS)​ కేసుల్లో నేరస్తులపై హిస్టరీ షీట్స్ (History Sheets) ఓపెన్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

SP Rajesh Chandra | డయల్​100 కాల్స్​కు తక్షణమే స్పందించాలి

డయల్ 100 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రతిరోజు డ్రంకన్​ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

SP Rajesh Chandra | ఫేక్​ నంబర్​ ప్లేట్లపై..

ఫేక్ నెంబర్ ప్లేట్లు, నెంబర్ ప్లేట్లు మార్పుపై ప్రత్యేక దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 22 నుండి ప్రారంభమయ్యే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడిందన్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతులు లేవని, భక్తిశ్రద్ధలతో సంప్రదాయాలకు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించడానికి పోలీసుశాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ప్రజలు సామరస్యంతో శాంతిభద్రతలను కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.