అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం డీఐఈఓ DIEO రవికుమార్ విచారణ జరిపారు. అధ్యాపకులను, విద్యార్థులను, కళాశాల సిబ్బందిని విచారించారు.
ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు సంబంధిత అధ్యాపకుడిపై పొక్సో కేసు POCSO case నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు సైతం తమకు న్యాయం చేయాలంటూ కోరారు.
దీంతో పోలీసులతో పాటు ఇంటర్ విద్యాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల CCTV cameras ను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.