Homeతాజావార్తలుChaderghat Incident | చాదర్ఘాట్ కాల్పుల కేసులో కొనసాగుతున్న విచారణ.. విషమంగా రౌడీ షీటర్​ పరిస్థితి

Chaderghat Incident | చాదర్ఘాట్ కాల్పుల కేసులో కొనసాగుతున్న విచారణ.. విషమంగా రౌడీ షీటర్​ పరిస్థితి

చాదర్​ఘాట్​ కాల్పుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై డీసీపీ చైతన్య సుల్తాన్ బజార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chaderghat Incident | హైదరాబాద్​ నగరంలోని చాదర్​ఘాట్​ కాల్పుల కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రౌడీ షీటర్ ఒమర్ (rowdy sheeter Omar) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

చాదర్​ఘాట్​లో (Chaderghat) ఓ వ్యక్తి దగ్గర ఫోన్​ చోరీ చేసి, అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ముగ్గురు నిందితులు ఫోన్​ చోరీ చేసి ఆటోలో పారిపోయేందుకు యత్నించారు. అక్కడే ఉన్న డీసీపీ చైతన్య, ఆయన గన్​మన్​ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు నిందితులు పారిపోగా.. ఒమర్​ అక్కడ ఉండిపోయాడు. గనమన్ పట్టుకోవడానికి యత్నించగా.. కత్తితో దాడి చేయబోయాడు. దీంతో డీసీపీ చైతన్య (DCP Chaitanya) ఒమర్​పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

Chaderghat Incident | నిందితుల కోసం గాలింపు

ఈ కేసులో మరోసారి విక్టోరియా గ్రౌండ్స్కు క్లూస్ టీమ్ చేరుకుంది. ఒమర్తో ఉన్న నిందితుడు అన్సారీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కాల్పుల్లో గాయపడ్డ రౌడీ షీటర్ ఒమర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే నిందితుడికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆదివారం ఆపరేషన్​ నిర్వహించనున్నారు.

Chaderghat Incident | డీసీపీ ఫిర్యాదు

కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు (Sultan Bazaar police) డీసీపీ చైతన్య ఫిర్యాదు చేశారు. కోటి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు యత్నించారని తెలిపారు. ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒమర్​ను పట్టుకునేందుకు తన గన్​మన్ మూర్తి ప్రయత్నించాడని, మిగతా ఇద్దరు ఆటోలో పారిపోయారని పేర్కొన్నారు. ఒమర్ నెట్టడంతో తాము కిందపడిపోయామని ఆయన తెలిపారు. అనంతరం గన్​మన్​ మూర్తిని కత్తితో పొడిచి చంపేందుకు ఒమర్ ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను కాపాడేందుకు నిందితుడిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు.

Must Read
Related News