Homeతాజావార్తలుCM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జర్మనీ ప్రతినిధులను కోరిన సీఎం

CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జర్మనీ ప్రతినిధులను కోరిన సీఎం

సీఎం రేవంత్​రెడ్డితో జర్మనీకి చెందిన ప్రతినిధి బృందం మంగళవారం భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్‌ను ఇన్నొవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని (German partnership) కోరుకుంటోందన్నారు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీల పెట్టుబడులు పెట్టాలని కోరారు.

జర్మనీ కాన్సులేట్ జనరల్ (చెన్నై) కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం సీఎంతో భేటీ అయింది. జర్మనీకి చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ డుయిష్ బోర్సా విస్తరణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (Global Capability Center)ను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో సీఎంను జర్మనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy | వెయ్యి మందికి ఉపాధి

డుయిష్ బోర్సా కంపెనీ ఏర్పాటు చేస్తున్న GCC ద్వారా వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు (employment opportunities) లభిస్తాయని జర్మనీ బృందం తెలిపింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇందుకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ నేర్చుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించాలని ఆయన కోరారు.