ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Instagram Love | ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. ఆంటీని పెళ్లి చేసుకున్న యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

    Instagram Love | ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. ఆంటీని పెళ్లి చేసుకున్న యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Instagram Love | ప్రస్తుత సోషల్​ మీడియా యుగంలో కొందరు తాత్కాలిక ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను కాదని, ముక్కు మొఖం తెలియని వారి కోసం వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత మోసపోతున్నారు. వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమై ఒక్కటవుతున్నారు. అనంతరం జీవితంతో ఓడిపోయి పలువురు తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(Tirupati District Srikalahasti)లో చోటు చేసుకుంది.

    Instagram Love | పిల్లలను కాదనుకొని..

    విశాఖపట్నానికి చెందిన పద్మ(40)కు భర్త, మెడికల్ రెప్రజెంటేటివ్​గా పని చేసే ఒక కొడుకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతురు ఉన్నారు. పద్మకు శ్రీకాళహస్తికి చెందిన సురేష్(25)తో ఇన్​స్టాగ్రామ్(Instagram)​లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సురేష్​ కోసం పద్మ ఓ సారి శ్రీకాళహస్తికి వెళ్లింది. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె 9 నెలల క్రితం మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సురేశ్​, పద్మ పెళ్లి చేసుకొని శ్రీకాళహస్తిలోని కైలసగిరిలో కాపురం పెట్టారు.

    Instagram Love | టిఫిన్​ వృథా చేసినందుకు..

    పెళ్లయిన నాటి నుంచి సురేష్​, పద్మ మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో టిఫిన్​ వేస్ట్​ చేస్తోందని పద్మను సురేష్​ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భయపడిన సురేష్​ ఆ విషయం ఎవరికి చెప్పకుండా తాను కూడా పురుగుల మందు తాగాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోన ఊపిరితో ఉన్న సురేష్‌ను పోలీసులు (Police) ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this