ePaper
More
    Homeక్రీడలుENG vs IND Match | ఉత్కంఠ‌గా మారిన తొలి టెస్ట్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా...

    ENG vs IND Match | ఉత్కంఠ‌గా మారిన తొలి టెస్ట్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG vs IND Match : ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్ట్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. టీమిండియా(Team India)కు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

    జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్​ అయింది. ఓలీ పోప్ Ollie Pope(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్ Harry Brook (99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

    భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ Mohammed Siraj (2/122) రెండు వికెట్లు తీశాడు. చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

    ENG vs IND Match : ట‌ఫ్ ఫైట్..

    రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో బుమ్రా వేసిన ఓవర్‌ నాలుగో బంతికి హ్యారీ బ్రూక్.. మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో బ్రూక్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.

    కానీ, అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో బ్రూక్.. తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో బుమ్రా మూడు నోబాల్స్ వేయడం గమనార్హం. ఈ అవకాశంతో మూడో రోజు ఆటలో చెలరేగిన బ్రూక్ Brook.. వన్డే తరహా బ్యాటింగ్‌తో భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు. 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 99 పరుగులు చేశాడు.

    అయితే, జస్‌ప్రీత్ బుమ్రా Bumrah తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్‌కు వరుస షాక్‌లు ఇచ్చాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ స్కోరు వేగాన్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా కొత్త బంతి వచ్చిన తర్వాత బుమ్రా మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. అతనికి మహమ్మద్​ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా తోడుగా నిలిచారు.

    సిరాజ్ రెండు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా కూడా తమ వంతు కృషి చేశారు. జస్ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీశాడు.

    భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన భార‌త్ తొంద‌ర‌గా తొలి వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగుల‌కే య‌శ‌స్విజైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఇక ప్ర‌స్తుతం కేఎల్ రాహుల్‌( 38 నాటౌట్)Kl rahul , సాయి సుద‌ర్శ‌న్‌( 21 నాటౌట్‌)తో క్రీజులో ఉన్నారు. భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 66 ప‌రుగులు చేయ‌గా.. భార‌త్‌కి 72 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...