అక్షరటుడే, నిజామాబాద్, కామారెడ్డి: Reunion | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు (joint Nizamabad district) చెందిన 2000 బ్యాచ్ పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో (Vamshi International Hotel) కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీస్ కానిస్టేబుల్స్, అధికారులు 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా అపూర్వ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాటి శిక్షణ కార్యక్రమాలు, అల్లర్లను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న వివరాలను ఒకరికొకరు పంచుకున్నారు.