అక్షరటుడే, ఇందూరు : 102 Ambulance | 102 వాహనాల్లో పైలెట్ల (డ్రైవర్ల) పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ జిల్లా ఇన్ఛార్జి జనార్దన్ ప్రకటన విడుదల చేశారు. జనవరి 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలు (Interviews) ఉంటాయని ఆయన వెల్లడించారు.
102 Ambulance | ఎస్సెస్సీ పాసైన అభ్యర్థులు..
102 వాహనంపై పైలెట్ ఉద్యోగానికి గాను ఆసక్తి గల యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. పైలెట్ ఉద్యోగానికి (Pilot Job) దరఖాస్తు చేసుకునే వ్యక్తులు కనీసం ఎస్సెస్సీ పాసై ఉండాలని సూచించారు. వయస్సు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని నిజామాబాద్ జిల్లాలోనే (Nizamabad District) పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్వ్యూలు జిల్లా జనరల్ ఆస్పత్రిలోని (District General Hospital) ‘108’ కార్యాలయంలో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఇతర వివరాలకు 9100799161 నంబరును సంప్రదించాలని సూచించారు.
102 Ambulance | ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థుల కోసం..
పైలెట్ పోస్టు కోసం ఇంటర్వ్యూలకు వచ్చేవారు తప్పనిసరిగా ఎస్సెస్సీ, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్(బ్యాడ్జ్) వెంట తీసుకుని రావాలన్నారు. అలాగే అన్ని సర్టిఫికెట్లలోనూ డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా కరెక్టుగా ఉండాలని సూచించారు. అభ్యర్థులకు మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.