అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cyber Crime | అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. సైబర్ క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు (Cyber Crime DSP Venkateswara Rao) తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఈస్ట్ ముంబాయిలోని (Mumbai) బోరువల్లికి చెందిన పాండురంగ్ సుభాష్ మహాపంకర్ అనే పేరున్న వ్యక్తి సాగర్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఫేక్ సంస్థను స్థాపించాడు. నగరానికి చెందిన శ్రవణ్‌కుమార్‌ను ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ. 31,36,900 ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసానికి పాల్పడ్డాడు.
దీంతో శ్రవణ్‌కుమార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సదరు నిందితుడు మహారాష్ట్రలో (Maharashtra) ఉంటున్నట్లుగా గుర్తించారు. అనంతరం సైబర్ క్రైం సీఐ ముఖిద్ పాషా, సిబ్బంది సురేష్, నాగభూషణం, ప్రవీణ్, నరేష్ ఈనెల 1న మహారాష్ట్ర వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి అక్కడి నుంచి తీసుకొచ్చి నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.