Homeజిల్లాలునిజామాబాద్​Pothangal mandal | అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ తనిఖీ

Pothangal mandal | అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ తనిఖీ

చెక్​పోస్టు వద్ద ప్రతిఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సివిల్​ సప్లయ్​ డీటీ హన్మాండ్లు సూచించారు. మంజీర అంతర్రాష్ట్ర చెక్​పోస్టును బుధవారం ఆయన తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Pothangal mandal | పోతంగల్‌ మండలకేంద్రంలోని మంజీర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను (Manjira Interstate Checkpost) సివిల్‌ సప్లయ్‌ డీటీ హన్మాండ్లు (Civil Supply DT Hanmandlu) బుధవారం తనిఖీ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోతంగల్‌ మహారాష్ట్ర సరిహద్దు (Maharashtra border) ప్రాంతంలో ఉండడంతో మహారాష్ట్ర నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా నిఘా ఉంచాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీస్‌ సిబ్బందికి సూచించారు. చెక్‌పోస్ట్‌ తనిఖీ (Checkpost Inspection) చేసి అక్కడ ఉన్న వసతులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏఈఓ శంకర్, మల్కన, సుధాకర్, శ్రీనివాస్, విఠల్, షేక్‌ హైమద్, నర్సింలు తదితరులున్నారు.