Homeజిల్లాలుకామారెడ్డిTelangana Police | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్​కు అంతర్జాతీయ మెడల్

Telangana Police | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్​కు అంతర్జాతీయ మెడల్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Telangana Police | అమెరికాలో తెలంగాణ కానిస్టేబుల్​ అంతర్జాతీయ మెడల్ (International Medal) సాధించాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ మహమ్మద్ బాబా (Constable Mohammed Baba) ప్రస్తుతం ఐజీపీ స్పోర్ట్స్ హైదరాబాద్‌లో (IGP Sports Hyderabad) అటాచ్డ్​గా విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 27 నుంచి ఈనెల 6 వరకు అమెరికాలోని బర్మింగ్‌హామ్​లో (Birmingham) జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2025లో (World Police and Fire Game) పాల్గొన్నారు.

షాట్‌పుట్-ట్రాక్ అండ్ ఫీల్డ్ (hot Put-Track and Field) (35 ప్లస్​) విభాగంలో తెలంగాణ నుండి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆయన బ్రాంజ్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ఇది కామారెడ్డి జిల్లా పోలీస్‌కు గర్వకారణమన్నారు. ప్రతిభావంతులకు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుల్ మహమ్మద్ బాబాకు శుభాకాంక్షలు తెలిపారు.