అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ పోలీసులు hyderabad police అంతర్జాతీయ స్థాయి అవార్డు సాధించారు. దుబాయి dubaiలో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ world police summitలో హైదరాబాద్ అవార్డు అందుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగం అరికట్టడంలో హైదరాబాద్ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. దీంతో హైదరాబాద్‌కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కొటిక్స్ అవార్డు Excellence in Anti-Narcotics Award అందించారు. దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ hyderabad cp anand ఈ అవార్డు అందుకున్నారు. ఈ సమ్మిట్లో 138 దేశాలు పాల్గొనగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తెలంగాణకే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణమన్నారు. అవార్డు సాధించడంలో సిబ్బంది కృషిని ఆయన కొనియాడారు.
