అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతర(Medaram Jatara) అభివృద్ధి పనులపై సోమవారం జరిగిన సమీక్ష సమావేశానికి ఆ శాఖ మంత్రిగా కొండా సురేఖ హాజరు కాకపోవడంపై వచ్చిన ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు.
మంగళవారం వరంగల్(Warangal)లో విలేకరులతో మాట్లాడిన ఆమె.. అత్యవసర పరిస్థితుల వల్లే మీటింగ్‌కు హాజరు కాలేదని చెప్పారు. మంత్రిగా తనకు వేరే పనులు కూడా ఉంటాయని చెప్పారు. సమావేశాన్ని రద్దు చేసుకునే హక్కు తనకు ఉంటుందన్నారు.
Konda Surekha | ఎవరి అభిప్రాయం వాళ్లది..
మంత్రుల మధ్య భేదాభిప్రాయాలపై కొండా సురేఖ పరోక్షంగా స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని, అందులో బబపట్టాల్సిన పని లేదన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పార్టీ కేడర్ అభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. పదవి ఆశించే వారు నామినేషన్లు వేయవచ్చన్నారు.
Konda Surekha | మంత్రుల మధ్య విభేదాలు..
మేడారం జాతర పనుల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy), కొండా సురేఖ(Konda Surekha) మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. మేడారం పనులను పొంగులేటి తన సొంత కంపెనీకి కట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొండా ఆగ్రహంతో ఉన్నారు. అలాగే, తన శాఖలో జోక్యం చేసుకోవడంతో పాటు వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ వేలు పెడుతున్నారని ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మేడారం అభివృద్ధి పనులపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు పొంగులేటి, సీతక్క(Minister Seethakka) హాజరయ్యారు. అయితే, దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ మాత్రం గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.