అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary Evaluation | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రెండోదశ మూల్యాంకనం ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar) తెలిపారు. ఫిజిక్స్, ఎకనామిక్స్, బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్ట్ల మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు అధ్యాపకులు ఆర్డర్ కాపీలను కళాశాల లాగిన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ప్రైవేట్ కళాశాలల (Private colleges) నుంచి మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను రిలీవ్ చేయాలని సంబంధిత ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. లేకపోతే ఇంటర్ బోర్డ్ (Inter Board) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అధ్యాపకులు 31వ తేదీ ఉదయం 10 గంటలకు నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో (Boys Junior College,Nizamabad ) రిపోర్ట్ చేయాలని సూచించారు.