అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో భాగంగా శుక్రవారం డీఐఈవో రవికుమార్(DIEO Ravikumar) డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను(Question Papers) పరిశీలించారు. అనంతరం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ జూనియర్ కళాశాల, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.