అక్షరటుడే, వెబ్డెస్క్: Hall Tickets | ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (supplimentary exams) హాల్ టికెట్స్ (hall tickets) విడుదల అయ్యాయి. ఈ నెల 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (inter supply exams) జరగనున్నాయి. ఇంటర్ బోర్డు (inter board) హాల్టికెట్లను శనివారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ప్రాక్టికల్ పరీక్షలు practical exams, జూన్ 9, 10 తేదీల్లో ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా.. ఇంటర్ ఫస్టియర్లో fist year 65.96 శాతం, సెకండియర్ second yearలో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఫస్టియర్ విద్యార్థుల్లో ఫెయిల్ అయిన వారితో పాటు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్(Improvement) రాసే వారు కూడా ఉంటారు. సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది హాజరుకానున్నారు. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.