ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ సంతానాన్ని సాకుతున్నారు. తాము పడుతున్న కష్టాలు తమ పిల్లల దరి చేరొద్దని అహర్నిషలు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. తమ పేగు తెంచుకు పుట్టిన వారికి ఏ కష్టం తెలియకుండా పెంచుతున్నారు.

    అదే పిల్లల పాలిట శాపంగా మారుతుందేమో.. తల్లిదండ్రులు సంపాదించి పెడుతుంటే.. హాయిగా చదువు కుంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాల్సింది పోయి.. హావారాగా మారుతున్నారు. ఉత్త పుణ్యానికే ఆవేశానికి లోనవుతున్నారు. ఓపిక లేకుండా మారుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలనే తీసుకుంటున్నారు.

    Inter student : చిన్న కారణాలకే..

    ప్రేమించిన అమ్మాయి / అబ్బాయి మాట్లాడట్లేదని, ప్రేమలో విఫలమయ్యామని, స్కూల్‌ టీచర్స్‌(school teachers) / ఉపాధ్యాయులు తిట్టారని, తల్లిదండ్రులు మందలించారని, అడిగిన వస్తువులు కొనివ్వలేదని.. ఇలా చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను శోక సంద్రంలోకి నెట్టి, జీవితకాలం శిక్షను విధిస్తున్నారు.

    READ ALSO  Krishna River | కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

    తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. కొత్త చీర కొనివ్వలేదని ఓ ఇంటర్​ విద్యార్థిని సూసైడ్​ చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని సత్యసాయి జిల్లా(Sathya Sai district)లో వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల (parents) ప్రేమనే ప్రశ్నార్థకం చేసింది.

    ధర్మవరం (Dharmavaram) బాలాజీ నగర్‌కి చెందిన ఇంటర్​ విద్యార్థిని ఉష ఈ దారుణానికి పాల్పడింది. ఉష స్థానికంగా ఇంటర్​ చదువుతోంది. కాగా, కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్రెషర్స్ డే (Freshers’ Day) కు కొత్త చీర కొనివ్వాలని ఉష ఇంట్లో మారాం చేసింది. ఎందుకంటే ఫస్టియర్​ పిల్లలకు సెకండియర్​ పిల్లలు స్వాగతం పలికేందుకు చీర కట్టుకు రావాలని నిర్ణయించుకున్నారు.

    Inter student : కొత్త చీర కొనివ్వలేదని ఇంట్లో ఉన్న పాత చీరతో..

    అందుకే తనకు కొత్త చీర కొనివ్వాలని ఉష తన తల్లిని కోరింది. కాగా, ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున కొత్త చీర కొనేందుకు డబ్బులు లేవని తల్లి చెప్పింది. దీంతో ఉష తీవ్ర మనస్తాపానికి గురైంది. స్నేహితులు అందరూ కొత్త చీర కట్టుకొని వస్తారు.. తాను ఫ్రెషర్స్ పార్టీకి ఎలా వెళ్లేదని తీవ్ర ఒత్తిడికి లోనైంది. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్​ చేసుకుంది. ఇంట్లో ఉన్న పాత చీరతో ఉరేసుకుంది.

    READ ALSO  Nara Lokesh | వైఎస్​ జగన్​కు మంత్రి లోకేశ్​ కౌంటర్​

    రోజంతా పని చేసుకుని అలసి ఇంటికి చేరిన తల్లి.. కూతురు విగత జీవిగా వేలాడటం చూసి షాక్​ అయింది. కొత్త చీర కొనివ్వలేదనే చిన్న కారణంతో పండంటి విలువైన జీవితాన్ని క్షణికావేశంలో ముగించుకున్న కూతురును చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

    Inter student : హైదరాబాద్​లోనూ ఇలాంటి ఘటన..

    హైదరాబాద్​లోనూ గతంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా .. తన తండ్రి ప్యాంటు చిన్నగా ఉన్నది కొనిచ్చాడని, వేరేది మార్చమంటే మందలించాడనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలోనే బలవన్మరణం చెందడం వల్ల, అటు కాలేజీ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేశాడు. ఇటు తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు.

    Latest articles

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    More like this

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...