అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minor Girl : మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar district) జడ్చర్లలో దారుణం చోటుచేసుకుంది. జడ్చర్ల (Jadcharla) పోలీస్ స్టేషన్ (police station) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక గర్భం దాల్చింది. కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఈ బాలికను పరిచయం చేసుకున్న ఇద్దరు యువకులు మాయమాటలు శారీరకంగా లొంగదీసుకున్నారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఇది జరిగి ఎనిమిది నెలలు అయింది.
Minor Girl : మగబిడ్డకు జన్మ..
హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి(government hospital)లో ఈ నెల 2న మగబిడ్డకు జన్మనిచ్చింది. చదువుకునే వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలిక ప్రస్తుతం తీవ్ర వేదనకు గురవుతోంది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని మోసం చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Minor Girl : టీనేజ్లో
పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్(INTER)లోకి అడుగు పెట్టిన పిల్లలు పెద్దవాళ్లమైనట్లు ఫీలవుతున్నారు. ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు లోనవుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. పండంటి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఉజ్వల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. జీవితం చేతుల్లో నుంచి జారిపోయాక ఇబ్బందిపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం ఈ బాధిత బాలిక ఎదుర్కొంటోంది.