HomeUncategorizedPawan Kalyan | బ్యాటరీ సైకిల్​ రూపొందించిన ఇంటర్​ విద్యార్థి.. ముచ్చటపడి నడిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan | బ్యాటరీ సైకిల్​ రూపొందించిన ఇంటర్​ విద్యార్థి.. ముచ్చటపడి నడిపిన పవన్ కల్యాణ్

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Pawan Kalyan : ఆ విద్యార్థి చదువుతుంది ఇంటర్​.. ఆలోచనలు ఇంజినీరింగ్ స్థాయి.. తన సమస్యకు పరిష్కారం చూసుకున్నాడు. దూరాన ఉన్న కాలేజీకి వెళ్లేందుకు సొంతంగా బ్యాటరీ సైకిల్​ను రూపొందించాడు. ఈ విద్యార్థి రూపొందించిన సైకిల్​ను చూసి ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి (Andhra Pradesh Deputy Chief Minister) ముచ్చట పడ్డారు. ఆ సైకిల్​ కూర్చుని సదరు బాలుడిని కూర్చోబెట్టుకుని చక్కర్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Pawan Kalyan : ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లోని విజయనగరం జిల్లా(Vizianagaram district)కు చెందిన ఇంటర్​(intermediate) విద్యార్థి రాజాపు సిద్ధూ బ్యాటరీ సైకిల్​ను రూపొందించాడు. జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ పదో తరగతి తర్వాత దూరాన ఉన్న ఇంటర్మీడియెట్​ కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడు. తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కున్నాడు. తన సైకిల్​ను బ్యాటరీ సైకిల్​గా మార్చేశాడు. సిద్ధూ రూపొందించిన బ్యాటరీ సైకిల్​ మూడు గంటలపాటు ఛార్జింగ్​ చేస్తే.. 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Pawan Kalyan : రూ. లక్ష ప్రోత్సాహకం..

సృజనాత్మక ఆలోచన(creative idea)తో బ్యాటరీ సైకిల్​(battery cycle) ఆవిష్కరించిన సిద్ధూ బ్యాటరీ సైకిల్​ సోషల్ మీడియాలో వైరల్​ అయింది. సామాజిక మాధ్యమాల(social media) ద్వారా సిద్ధూ గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆ బాలుడిని మంగళరిగి(Mangalari)లోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. స్వయంగా సైకిల్​ను చూసి నడిపారు. విద్యార్థి ఆవిష్కరణను స్వయంగా తిలకించి, ముచ్చట పడ్డారు. ఈ సందర్భంగా బాలుడు సిద్ధూని అభినందించారు. ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని సిద్ధూకు సూచించారు. ప్రోత్సాహకంగా బాలుడికి రూ. లక్ష అందించారు. అనంతరం బాలుడితో కలిసి బ్యాటరీ సైకిల్ పై చక్కర్లు కొట్టారు.