అక్షరటుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్ మండల కేంద్రంలో ఎస్‌జీఎఫ్ అంతర్ పాఠశాల క్రీడోత్సవాలు (SGF Inter-school Sports Festival) మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టోర్నీలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి నరేందర్ (Education Officer Narender) మాట్లాడుతూ.. విద్యార్థులంతా క్రీడాస్ఫూర్తితో మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి మండల తహశీల్దార్ రమేశ్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై అప్పారావు, పీఆర్టీయూ నాయకులు, వీడీసీ నాయకులు హాజరయ్యారు. మార్చ్ఫాస్ట్లో ప్రతిభ చూపి ఆలూర్ ప్రభుత్వ పాఠశాల మొదటి బహుమతి, కల్లెడి పాఠశాల ద్వితీయ బహుమతి, మిర్దాపల్లి పాఠశాల తృతీయ బహుమతిని సాధించాయి.